తెలంగాణాలో ఎన్నికల వేడితో, ఆంధ్రాలో కూడా హీట్ పరుగుతుంది. దానికి కారణం, తెలుగుదేశం పార్టీ, రెండు చోట్లా ఉండటం. మిగతా ఏ పార్టీలు కూడా, రెండు చోట్లా ఉనికిలో లేవు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి గణనీయంగా క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ని తమ వైపు తిప్పుకోవాలని, అటు కాంగ్రెస్, కెసిఆర్ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మాత్రం, తెలుగుదేశం పార్టీని వీడలేదు. నాయకులు పోయినా, కార్యకర్తలు 15 ఏళ్ళు అధికారం లేకపోయినా, అదే అభిమానంతో పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఈ తరుణంలో కెసిఆర్, మోడీతో సాన్నిహిత్యంగా ఉండటంతో, కెసిఆర్ ని ఓడించటానికి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయనే ప్రచారంలో, చంద్రబాబు ఈ రోజు తెలంగాణా పర్యటన చేసారు.
చంద్రబాబు ఈ రోజు, కాంగ్రెస్ తో పొత్తు గురించి ప్రస్తావిస్తారని, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి, అలాగే కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, దీన్ని ఆంధ్రా - తెలంగాణా సెంటిమెంట్ గా మార్చుదాం అని కెసిఆర్ కాచుకుని కూర్చున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం, తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో, ఇద్దరికీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. చంద్రబాబు చాలా సేపు మాట్లాడినా, ఎక్కడా కెసిఆర్ పేరు ఎత్తలేదు. ప్రసంగం మొత్తం మోడీని టార్గెట్ చేసారు. అలాగే, ఎక్కడా కాంగ్రెస్ తో పొత్తు విషయం డైరెక్ట్ గా చెప్పలేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, నేను మీకు సహకరిస్తాను అని, తెలంగాణా టిడిపి నేతలకు చెప్పారు. దీంతో, అటు కెసిఆర్, ఇటు జగన్, ఇద్దరూ నిరాస చెందారు.
చంద్రబాబు ఇలా చెప్పటం వెనుక చాలా కసరత్తు జరిగింది. ప్రస్తుతం, కెసిఆర్ పరిపాలన పై ప్రజలకు బాగా వ్యతిరేకత ఉంది. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వీక్ గా ఉండబట్టి కాని, లేకపోతే కెసిఆర్ అసలు పోటీలోనే లేకపోయే అంత వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో, కెసిఆర్ తన పరిపాలన గురించి చెప్పుకోవటానికి, పెదాగా ఏమి లేదు. అందుకే చంద్రబాబు కోసం కెసిఆర్ ఎదురు చూసారు. చంద్రబాబు వచ్చి తన పై, తన ప్రభుత్వం పై విమర్శలు చేస్తే, ఇదిగో ఆంధ్రా వాడు వచ్చి, మన తెలంగాణా వాళ్ళని అంటున్నారు అంటూ, మళ్ళీ ఆంధ్రా - తెలంగాణా సెంటిమెంట్ రగిలించి, ఈజీగా ఎన్నికలు నెగ్గే ప్లాన్ వేసాడు. అయితే ఈ రోజు చంద్రబాబు మాత్రం, కెసిఆర్ కు ఆ అవకాసం ఇవ్వలేదు. ఆంధ్రా మీద ఏడుపు అనేది ఇక కెసిఆర్ ఎజెండాలో లేకుండా చేసారు.. ఇక కెసిఆర్ పరిపాలన పైనే ఎన్నికలు జరుగుతాయి.. తెలంగాణా ప్రజలు తేలుస్తారు.
మరో పక్క మోడీని టార్గెట్ చేస్తూ, మోడీని మళ్ళీ రానివ్వకూడదు అని, మోడీకి ప్రత్యేక్షంగా, పరోక్షంగా సహకరించే వారికి బుద్ధి చెప్పాలి అంటూ, చాలా తెలివిగా ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, మరో పక్క జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు గురించి ప్రస్తావన చెయ్యగానే, రచ్చ రచ్చ చెయ్యటానికి రెడీ అయ్యారు. అయితే, ఇక్కడ కూడా చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. పొత్తుల నిర్ణయం తెలంగాణ నేతలదేనని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రచారం చేయబోనని పరోక్షంగా చెప్పారు. తెలంగాణలో పార్టీ బాగు కోసం ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ నేతలు సమష్టిగా పనిచేయాలని కోరారు. ఎన్నికల్లో పోరాడండి.. అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల అభిప్రాయం ప్రకారం పార్టీ పనిచేయాలని స్పష్టం చేశారు. చంద్రబాబు, కెసిఆర్ ని టార్గెట్ చెయ్యకుండా ఉండటం పై, కొంత మంది తెలంగాణా తెలుగుదేశం శ్రేణులు అసంతృప్తి చెందినా, చంద్రబాబు ఎందుకు అలా మాట్లాడారో తెలుసుకున్నారు. కెసిఆర్, జగన్ కు ఒకేసారి, చెక్ పెట్టారని అంటున్నారు.