ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యర్ధి పార్టీ అంటే చాలు, శత్రువుని చూసినట్టు చూస్తున్న రోజులు ఇవి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలను, చంద్రబాబు నాయుడుని, అధికార వైసీపీ పార్టీ ఎలా చేస్తుందో చూస్తున్నాం. చంద్రబాబు హోదాకి కాదు కదా, చంద్రబాబు వయసుకి కూడా విలువ ఇవ్వకుండా వైసీపీ పార్టీ చేస్తున్న చేష్టలు, మరింత గ్యాప్ పెంచుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి లెక్క లెక్క సెట్ చేస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. వైసీపీ వైఖరితో, రాజకీయ వైరం రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ తరుణంలో, ఈ రోజు చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు, అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ రోజు మంత్రి గౌతం రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు, జరుగుతున్న రాజకీయ విష క్రీడ పక్కన పెట్టి, ఒక రాజ నీతిజ్ఞుడులాగా స్పందించిన తీరు, అందరి ప్రశంసలు అందుకుంది. రాజకీయ వైరం, వైసిపీ తమ పైన చేస్తున్న వ్యక్తిగత దాడి, ఇవన్నీ పక్కన పెట్టి మరీ చంద్రాబాబు వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. చంద్రబాబు గౌతం రెడ్డి కుటుంబ సభ్యులని పరామర్శించి, వారిని ఓదార్చారు. మరీ ముఖ్యంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి దగ్గర కూర్చుని ఓదార్చారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గౌతం రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. గౌతం రెడ్డి ఎంతో హుందాగా ప్రవర్తించే వారని, ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే గౌతం రెడ్డి దుబాయ్ వెళ్ళి పారిశ్రామిక సదస్సులో పాల్గున్న వార్తలు కూడా చూసినట్టు చంద్రబాబు చెప్పారు. ఇంత చిన్న వయసులో చనిపోవటం బాధాకరం అని అన్నారు. అంతే కాదు, ఇది అయిపోయిన తరువాత, టిడిపి మీటింగ్ ఒకటి పెట్టుకుంటే, ఆ మీటింగ్ మొదలు పెట్టగానే, గౌతం రెడ్డి మృతికి సంతాపం ప్రకటించి, మీటింగ్ మొదలు పెట్టారు. ఇదే సందర్భంలో గతంలో వైసీపీ వ్యవహరించిన తీరుని, ప్రజలు గుర్తు చేసుకంటున్నారు. భుమా నాగరెడ్డి గుండెపోటుతో చనిపోతే, చంద్రబాబు ఒత్తిడి పెట్టి చంపేశారని ప్రచారాలు చేసారు. అలాగే ఎమ్మెల్యే కిడారి నక్సల్స్ దా-డి-లో చనిపోతే, చంద్రబాబు కాపాడుకోలేక పోయారు అన్నారు. ఇక కోడెల, తనను వేధిస్తున్నారని ఆ-త్మ-హ-త్య చేసుకుంటే, చంద్రబాబు పట్టించుకో లేదని, అందుకే పోయాడని అన్నారు. ఇలా వైసీపీ వ్యవహరించిన తీరుని, ఈ రోజు టిడిపి వ్యవహరించిన తీరుని, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.