మనకు ఇది వరకు తెలిసింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు అంటే, ధన యజ్ఞం... అలాంటిది, చంద్రబాబు వచ్చిన తరువాత, సంవత్సరం లోపే, పట్టిసీమ పూర్తి చేసి, అసలైన జల యజ్ఞం అంటే ఏంటో చేసి చూపించారు... అదే స్ఫూర్తితో, ప్రాధాన్యతా క్రమంలో, రాష్ట్రంలో ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు... అదే క్రమంలో, మొన్నటి దాక 28 ప్రాజెక్ట్ లు ప్రాధాన్యతా క్రమంలో పెడితే, వాటిని 50 కి పెంచారు... ఇప్పుడు, ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో మరో రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేర్చారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ రెండింటితో ప్రాధాన్య ప్రాజెక్టుల సంఖ్య 52కు చేరింది. ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభించగా మరో 5 పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 15 నాటికి మరో 15 ప్రాజెక్టులు పూర్తికానున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 54శాతం పూర్తయిందని తెలిపారు. జలసంరక్షణ ఉద్యమం చేపట్టి నెల రోజులు కావస్తోందని, 247 కోట్ల రూపాయల పనులు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో 52 ప్రాజెక్టులను ప్రాధాన్యతాపరంగా గుర్తించగా, వాటిలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని , రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభానికి 5 ప్రాజెక్టులు సిద్ధంగా ఉండగా, వచ్చే జూన్ నాటికి 15 ప్రాజెక్టులను పూర్తిచేయనున్నామన్నారు. ఇవే కాకుండా ఈ ఏడాది డిసెంబర్ నాటికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ వే, స్పిల్ చానెల్, అప్రోచ్, పైలెట్ చానల్, స్పిల్ చానల్ బ్రిడ్జి, డయాఫ్రమ్‌వాల్, రేడియల్ గేట్ల నిర్మాణం ద్వారా వరద నీటి మళ్లింపునకు మొత్తం రూ.9,189.81 కోట్ల వ్యయమయ్యిందన్నారు.