నవ్యాంధ్రకు, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటు వేదికగా, దేశంలోని అన్ని పార్టీలకు వినిపించారు... మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో చంద్రబాబు ‘సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌’గా మారారు... బీజేపీ, కాంగ్రెస్ తప్ప, అన్ని పార్టీల నేతలు చంద్రబాబును వచ్చి కలిసారు... ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే, బీజేపీలోని కొంత మంది నేతలు కూడా వచ్చి కలిసారు... దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పాత్ర క్రమంగా క్షీణిస్తుండటం... ప్రధాని మోదీని ఎదుర్కోగల దీటైన నేత కనిపించకపోవడంతో తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబువైపు ప్రతిపక్షాలు చూస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి... కాని, చంద్రబాబు మాత్రం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో, అన్ని పార్టీలు సహకరించి, కేంద్రం పై ఒత్తిడి తేవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు...

modi 04042018 1

మోదీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీయేతర పార్టీల ఫ్లోర్‌లీడర్లను పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరారు. శరద్ పవార్, ఫరూక్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్‌ సాతీవ్‌‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది...

modi 04042018 1

చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో, అందరి నేతలతో కలుస్తున్న టైంలో, ప్రధాని మదో రాజ్యసభ లాబీ నుంచి బయటకు వచ్చి వెళ్తూ ఉండగా, సెంట్రల్ హాల్ మధ్యలో వివిధ పార్టీల నేతలతో చర్చిస్తున్న చంద్రబాబుని చూసారు... అయితే, ఒక్కసారి అలా చూసిన మోడీ, వెంటనే తల తిప్పుకుని, తన కార్యలయానికి వెళ్ళిపోయారు... ఇప్పటికే చంద్రబాబు, మోడీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న తరుణంలో, ఈ పరిణామం చోటు చేసుకుంది... 29 సార్లు ఢిల్లీ వచ్చి, రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని ప్రధానిని కోరిన చంద్రబాబు, 30వ సారి మాత్రం, ప్రధాని మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై పోరాడటానికి వచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read