కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలోనే మకాం వేసి, గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆయనను ఒక నమ్మక ద్రోహిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, ముఖ్యమంత్రి చంద్రబాబులను ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా ఇస్తామంటూ మోడీ ప్రామిస్ చేశారు...
అయితే, చివరకు ప్రత్యేక హోదాతో పాటు చంద్రబాబును కూడా తొక్కేసే ప్రయత్నం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ తరహాలో మన రాష్ట్రానికి కూడా ఎలాంటి హామీలనైనా ఇవ్వడానికి మోదీ ఏమాత్రం సంశయించడం లేదని చెప్పారు. ఇప్పటికే బెంగళూరు గర్వించదగ్గ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి రాఫెల్ కాంట్రాక్టును ఇతర ప్రాంతానికి తరలించారు అంటూ ట్వీట్ చేశారు. తద్వారా మోడీ ఇచ్చే హామీలను కర్ణాటక ఓటర్లు నమ్మవద్దని కోరారు... ఇప్పటికే కర్ణాటకలోని తెలుగు ప్రజలు, బీజేపీకి వోట్ వెయ్యద్దు అంటూ, ప్రచారం సాగుతుంది. సోషల్ మీడియా వేదికగా, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై, మోడీకి దిమ్మ తిరిగేలా తీర్పు ఇవ్వాలి అంటూ, ప్రచారం చేస్తున్నారు...
ఇది సిద్ధరామయ్య పెట్టిన ట్వీట్లు PM promised special status to Andhra Pradesh but let down the state & Shri Chandrababu Naidu @ncbn.. For Karnataka the PM didn’t even bother to promise anything...Instead he took away Rafael contract from Bengaluru’s pride the Hindustan Aeronautics Limited. #KarnatakaDefeatsBJP Our people will vote performance & not promise. @BSYBJP failed the one chance given him & now he is promising corruption free governance! PM @narendramodi promised to bring black money back & deposit 15 lakhs in each family’s bank account. Not a rupee came.#KarnatakaDefeatsBJP