తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రక్షాళన చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి క్రూయల్ పార్టీని ఎదుర్కోవాలి అంటే, కొత్త తరం నేతలు రావాలని, ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు కొంత మంది పని చేయకుండా, అధినేత ముందు షో చేస్తున్నారని, మరి కొంత మంది నేతలు, డబుల్ గేం ఆడుతూ కోవర్ట్ లుగా మారిపోయారని, ఇన్నాళ్ళు పార్టీ కార్యకర్తలు, తమ అధినేత ముందు గోడు చెప్పుకుంటూ వచ్చే వారు. చంద్రబాబు కూడా పాత రోజుల్లో లాగా కాకుండా, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవటం, మొహమాటాలకు పోవటంతో, ఇలాంటి నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా తాయారు అయ్యింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో, కొన్ని చోట్ల గెలిచినా, కొన్ని చోట్ల పోటీ ఇచ్చినా, కొన్ని చోట్ల మాత్రం ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమి కేవలం పార్టీలో ఉన్న కోవర్ట్ ల వల్లే అని చంద్రబాబు వద్ద పూర్తి సమాచారం ఉండటంతో, చంద్రబాబు కూడా ఇక రంగంలోకి దిగారు. ఇన్నాళ్ళు క్యాడర్ కోరుకున్న పని చేయటం మొదలు పెట్టారు. ప్రక్షాళన మొదలు పెట్టారు. గత వారం రోజులుగా వరుస పెట్టి సమీక్షలు చేస్తున్న చంద్రబాబు, కుప్పం సమీక్ష సందర్బంగా ఒక కీలక వ్యాఖ్య చేసారు. పార్టీలో కోవర్ట్ లు ఉన్నారని, ఒక్కొక్కరిని ఏరి పడేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు, ఇప్పుడు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు.

cbn 11122021 2

ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ ఓటమి పై చంద్రబాబు సమీక్ష చేసారు. ఈ సమీక్ష సందర్భంగా, పాత చంద్రబాబుని చూసారు అక్కడ నాయకులు. నెల్లూరులో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడిపోవటం పై చంద్రబాబు నేతల పై సీరియస్ అయ్యారు. పార్టీలో ఉంటూ కోవర్ట్ గా పని చేసిన కిలారి వెంకటస్వామి నాయుడు సహా మరో నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. నగర నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లకు వార్నింగ్ ఇచ్చారు. పని తీరు మార్చుకోక పొతే కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. అంతే కాదు, చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ, నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలు అన్ని రద్దు చేసారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాత, మరిన్ని సస్పెన్షన్ లు ఉంటాయని అన్నారు. ఇక నుంచి కుమ్మక్కు రాజకీయాలు ఉండవని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. కులం, మతం కార్డు ఉపయోగించి, రాజకీయాలు చేసే వారు, ఈ పార్టీలో అవసరం లేదని, పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించి, పార్టీని లైన్ లో పెడతానని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read