టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజు నెల్లూరులో పర్యటించారు. గంగపట్నంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి చంద్రబాబు వారిని కష్టాలు అడిగి తెలుసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు చూసి వరదలకు ఇళ్లు బురదమయం అయ్యాయని మహిళలు విలిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అటుగా వెళ్తూ ఉండగా, అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు తన బాధ చెప్పుకుంటూ, చంద్రబాబుని ఆపారు. వైసీపీకి ఓట్లేసి మోసపోయామని, ఏమీ పట్టించుకోవట్లేదని ఒక్కసారిగా చంద్రబాబు కాళ్లపై పడ్డారు. దీంతో వెంటనే సెక్యూరిటీ అలెర్ట్ అయ్యింది. చంద్రబాబు ఆ రైతుని దగ్గరకు తీసుకుని, రైతును ఓదార్చి ధైర్యం చెప్పారు చంద్రబాబు. గంగపట్నంలో బాధితులకు చంద్రబాబు ఆర్థికసాయం ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ప్రకటించారు చంద్రబాబు. గంగపట్నంలో నష్టపోయిన గిరిజనులు, జాలర్లకు పరిహారం ఇచ్చారు. ముంపు నుంచి ఇద్దరిని కాపాడిన సురేశ్‌కు నగదు ప్రోత్సాహం అందించారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రెండు వేలు ఇచ్చి సరిపెట్టుకుంటాం అని చెప్తుంటే, చంద్రబాబు మాత్రం బాధితులకు ఏకంగా 5 వేలు ఇస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు.
చంద్రబాబు నెల్లూరు పర్యటనలో, అనూహ్య ఘటన.. ఒక్కసారిగా అలెర్ట్ అయిన సెక్యూరిటీ...
Advertisements