రాష్ట్ర విభజన అంశాలపై మరోసారి ఉన్నతస్థాయి బృందాన్ని ఢిల్లీకి పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. విభజన అంశాలపై ఇప్పటికే కేంద్రంపై మండిపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉన్నతస్థాయి బృందాన్ని పంపడం ద్వారా తాడోపేడో తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నది. తాజాగా అధికారులతో సమావేశమైన సందర్భంగా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వివరాలు సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా వివిధ పథకాలకు సంబంధించి న నిధుల విషయమై ఒక నివేధిక తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆదేశించారు. అవే కాకుండా నాలుగేళ్లలో వివిధ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడాన్ని ప్రశ్నించాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

2G 21122017 2

ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం పాలనాపరంగా చివరిది కావడంతో నిధులు ఎక్కువ రాబట్టాలనే ఆలోచన ఉంది. అయితే వరుస రిమైండర్ల పేరుతో గుర్తుచేసినప్పటికీ స్పందన లేదనే అభిప్రాయం ముఖ్యమంత్రిలో ఉంది. ఫలితంగానే ఈ సారి కేంద్రం వద్ద గట్టిగా వాదించేందుకు కసరత్తు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే విధంగా విభజన చట్టంలోని 18 అంశాలపై కూడా పనిలో పనిగా నిలదీయనున్నారు. మంత్రులు కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి లేదా ఇతర అధికారులను కలిసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందాన్ని పంపే విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే చివరి అస్త్రంగా కేంద్రం చేస్తున్న అన్యాయంపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం వుంది. కోర్టులో కేసు వేయడానికన్నా ముందే చివరి ప్రయత్నంగా ఉన్నతస్థాయి కమిటీని పంపాలని ప్రభుత్వం భావిస్తున్నది.

2G 21122017 3

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపి విభజన చట్టంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైందని తెలిపారు. విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో జాప్యంపై కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి సుధాకరరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు గాను ఇప్పటి వరకు కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పొంగులేటి సుధాకరరెడ్డి, గిడుగు రుద్రరాజును పిటిషనర్లుగా పరిగణిస్తు సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుందని రుద్రరాజు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read