టిడిపి అధినేత చంద్రబాబు అసలు సిసలు రాజకీయ నేత అవతారంలో ప్రత్యక్షమయ్యారు. సాంప్రదాయ రాజకీయాలని నమ్ముకుని ఇన్నాళ్లూ జగన్ రెడ్డితో పోరాడారు. అరాచక, నియంతృత్వ, ఫ్యాక్షన్ పోకడలతో జగన్ రెడ్డి అన్ని ప్రజాస్వామ్య పద్ధతులని కాలరాశాడు. ఈ నేపథ్యంలో తన సాంప్రదాయ రాజకీయ పోరాట పంథాని పక్కనబెట్టి దూకుడు రాజకీయ వ్యూహాలకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాపకింద నీరులా పని ఉంటే, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పంచుమర్తి అనూరాధని దింపి తన సీటు తానే గెలుచుకుని కూడా వైసీపీని చావుదెబ్బ కొట్టారు.
జగన్ రెడ్డి ప్రవర్తన, తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న విధ్వంసం ప్రజల ముందుంచి `` సైకో పోవాలి- సైకిల్ రావాలి`` అనే నినాదాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు టిడిపి శ్రేణులంతా జగన్ రెడ్డిని సైకో అనే పిలుస్తున్నారు. టిడిపి సోషల్ మీడియా అంతా జగన్ రెడ్డిని సైకో అనే సంబోధిస్తున్నాయి. ఇప్పుడు మరో స్లోగన్ ని జగన్ పైకి ఎక్కుపెట్టారు చంద్రబాబు. జగన్ రెడ్డి ప్రతీ సభలోనూ నేను మీ బిడ్డనంటూ ప్రాధేయపడుతున్న విషయాన్నే లైనుగా తీసుకుంది తెలుగుదేశం. చంద్రబాబు జగన్ రెడ్డి మీ బిడ్డ కాదు..రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ కొత్త నినాదంతో మరో క్యాంపెయిన్ తీసుకున్నారు. ఇది కూడా జనంలోకి బాగా వెళుతోంది.
జగన్ పై చంద్రబాబు సరికొత్త స్లోగన్.. మొదటి రోజే ప్రజల్లోకి దూసుకుపోతుంది..
Advertisements