ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కాగా... ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంలో గళమెత్తారు. ఈమేరకు 13 పేజీల సమగ్ర నివేదికను, 20 నిమషాల సమయంలో మాట్లాడారు.

niti ayog 17062018 2

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది అని, ప్రత్యెక హోదా సహా, ఏ విభజన హామీ కూడా నెరవేరలేదు అని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి అంటూ నిలదీసారు. అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాల్సిన నిధుల గురించి ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, కానీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విభజనతో ఆర్థికంగా ఏపీ నష్టపోయిందని, రెవెన్యూలోటును భర్తీ చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల సవరణలకు కూడా చంద్రబాబు పట్టుబట్టారు.

niti ayog 17062018 3

ముఖ్యమంత్రులకు 7 నిముషాల సమయం కేటాయించారు. ఈ సమయంలో చంద్రబాబు, 7 నిమషాలు పూర్తి కాగానే, మీ టైం అయిపొయింది అని రాజనాథ్ సింగ్ చెప్పటంతో, నేను చెప్పాల్సింది చాలా ఉంది అంటూ, ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, విభజన జరిగిన తర్వాత ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, కాబట్టి తన స్పీచ్‌ను ప్రత్యేకంగా చూడాలంటూ సుమారు 20 నిముసాల పాటు చంద్రబాబు ప్రసంగించారు. అయితే, అంతకు ముందు, ఎజెండాలో లేని అంశాన్ని ప్రస్తావించకూడదు అంటే నిరసన వ్యక్తం చేసేందుకు కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకుని, కేంద్రం, చంద్రబాబు మాట్లాడినంత సేపు, ఏమి అనకుండా, టైం అయ్యింది అని మాత్రమే చెప్పింది, అయితే దానికి కూడా చంద్రబాబు ధీటుగా స్పందిస్తూ, నేను మాట్లడాలి అని చెప్పి, 20 నిమషాలు ప్రసంగం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read