అడక్కుండా అడుగు పెట్టొద్దంటూ సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ‘నో ఎంట్రీ’ బోర్డు చూపడం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఏపీ తరహా నిర్ణయమే తీసుకున్నారు. సీబీఐకి 1989లో లెఫ్ట్‌ సర్కారు మంజూరు చేసిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. మరో పక్క, పంజాబ్‌ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఆరా తీసింది. పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరికి ఫోన్‌ చేసి వివరాలు అడిగారు. ‘‘సీబీఐని అనుమతించకుండా ఎలా ఉత్తర్వులిచ్చారు? మాకూ వివరాలు చెప్పండి’’ అని కోరారు.

cbn 17112018 2

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా చంద్రబాబుని సమర్ధిస్తూ ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన పనే చేశారు. ఏపీలో ఆదాయపన్ను విభాగాన్ని కూడా అనుమతించకూడదు. సీబీఐ, ఐటీ విభాగాల్ని మోదీ దుర్వినియోగం చేస్తున్నారు. నోట్లరద్దు కుంభకోణం వెనకున్న వారిని సీబీఐ ఎందుకు పట్టుకోవడం లేదు?" అంటూ ట్వీట్ చేసారు. కర్ణాటక ప్రభుత్వం కూడా, ఏపి నిర్ణయానికి మద్దతు తెలిపింది. మరో పక్క బీజేపీ పాలిత రాష్ట్రాలైన హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు సీబీఐకి సాధారణ సమ్మతి ఇవ్వలేదని ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

cbn 17112018 3

చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు మద్దతు ఇచ్చే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీబీఐ పలానా రాష్ట్ర పరిధిలో నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టాలన్నా, అవినీతి పై చర్యలు తీసుకోవాలన్నా, ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే అనేది చట్టం చెప్తుంది. చట్టం ప్రకారం, సీబీఐ ఏ కేసునూ సొంతంగా దర్యాప్తునకు చేపట్టలేదు. కేసు పరిధిని బట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కోరితేకాని, లేదా కోర్టు ఆదేశాలు ఉంటే మాత్రమే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అయితే. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర అధికారులు, పౌరులు, విడివిడిగా లేదా కలిసి అవినీతికి పాల్పడినట్లయితే సీబీఐ చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందేనని ఢిల్లీ స్పెషల్‌ పోలీసు చట్టమే చెబుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read