ఇప్పటికే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తిప్పలు పెడుతున్న కేంద్రం, ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అవమానించే పనిలో పడిందా అనే సందేహాలు వస్తున్నాయి. "స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ " అనే జాతీయ సంస్థ నిర్మాణం విజయవాడలో జరుగుతుంది. పనులు దాదాపుగా చివరకు వచ్చాయి. అయితే, దీని ప్రారంభోత్సవం రేపు, అనగా ఆగష్టు 23 న జరగనుంది. ఈ ఆహ్వాన పత్రిక చూసిన వారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ కార్యక్రమానికి, ముఖ్యమంత్రికి ఆహ్వానం లేదు. ఈ కార్యక్రమానికి ఉపరాస్ట్రపతి వెంకయ్య, గవర్నర్ నరసింహన్ వస్తున్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి పేరు లేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. కేంద్రం కావాలనే ఇలా అవమానపరుస్తుంది అంటూ, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వేస్తున్నారు.
రాష్ట్రంలో, అదీ రాజధాని ప్రాంతంలో జరిగే, ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్ మీద బిజెపి ప్రభుత్వం ఎంత కక్షకట్టి వస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ముఖ్యమంత్రి పేరు కాని, సహచర క్యాబినెట్ మంత్రుల పేర్లు కాని, రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించే ఎవరి పేరు లేదు. మరి, ఈ విషయం వెంకయ్య నాయుడు గారికి, గవర్నర్ గారికి తెలుసో తెలియదో మరి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా, రాష్ట్రం భూమి ఇవ్వకుండా, తగిన సహకారం ఇవ్వకుండా, నిర్మాణం జరిగేదా ? ఇలా ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్రవర్తించటం దారుణం.
23న ఉదయం 10 గంటలకు వెంకయ్యనాయడు, నరసింహన్‌లు విజయవాడలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పరిపాలన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలోను, అనంతరం 10.50 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ మూడో వార్షికోత్సవంలో పాల్గొంటారు. మరి రాష్ట్రం తరుపున, కనీసం ప్రోటోకాల్ గా కూడా ఎవరినీ పిలవకపోవటం ఎంత వరకు సమంజసం ? ఇక్కడ ఉన్న బిజెపి నాయకులు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా మరి ఇప్పుడేమి మాట్లాడుతారు కనీసం ప్రోటోకాల్ను పాటించాలన్న జ్ఞానం లేని ప్రభుత్వం నడుపుతున్న అంత అజ్ఞానం గా ఉన్నారా కేంద్రంలో అధికారులు.