సార్వత్రిక ఎన్నికల నగరా మోగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లకు ఎలా చేరువకావాలో దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీపై, బీజేపీ, టీఆర్ఎస్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు అని, ఆయన్ని నమ్మితే జైలుకు పంపుతాడని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన జగన్.. తనతోపాటు అనేక మందిని జైలుపాలు చేశాడని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేర చరిత్ర ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు. ఆ పార్టీతో పోరాటంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదన్నారు.
సార్వత్రిక ఎన్నికల నగరా మోగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత
ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటు అని నిప్పులు చెరిగారు. వాటిని కప్పిపెట్టడానికే మరిన్ని నేరాలు చేస్తున్నారని అన్నారు. నేరగాళ్ల ఆలోచనలు నేరాలు-ఘోరాల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కుట్రలు చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చరిత్రలో కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవన్నారు. ధర్మాన్ని ఏమార్చడం ఎవరి వల్లా కాదని, సత్యానికి ఉన్న శక్తి గొప్పదని పేర్కొన్నారు. ధర్మపోరాటంలో టీడీపీదే విజయం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం పనుల్లో తెలుగుదేశం నిమగ్నమై ఉంటే.. కుట్రలు చేసే పనుల్లో మోదీ, కేసీఆర్, జగన్ నిమగ్నమై ఉన్నారని దుయ్యబట్టారు.
సార్వత్రిక ఎన్నికల నగరా మోగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత కేసీఆర్ విషయమై ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ఆయన నోరు ఎలా మూయించాలో తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ‘మనం అంతా ఓటర్లతో మమేకం అవుతున్నాం.. వాళ్లంతా ఓట్లు తొలగించే కుట్రల్లో ఉన్నారు. మనం గ్రామాలు-వార్డులు తిరిగే పనుల్లో ఉన్నాం. వాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఫారం-7 ద్వారా కుట్రలు చేస్తున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు పార్టీల కుతంత్రాలకు ఈ ఎన్నికలు సమాధానం కావాలన్నారు.