నిన్న కౌంటింగ్ జరిగిన తీరు, ఎన్నికల ఫలితాల పై టిడిపి అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నిన్న కౌంటింగ్ సందర్భంగా జరిగిన అరాచకాలు, ఒక్కోటి చెప్తూ, వీడియో ప్రదర్శనలో కూడా చూపించారు. చంద్రబాబు మాటల్లో "బూతుల మంత్రి 271 ఓట్లతో వాళ్ల గ్రామంలో ఓడారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత గ్రామంలో 250 ఓట్లతో వైసీపీ ఓడిపోయింది. ఎంపీ మాధవ్ స్వగ్రామం రుద్రవరంలో టీడీపీ ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యే పీట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం లో 73 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఓడారు. గౌతంరెడ్డి గ్రామం మర్రిపాడులో 100 ఓట్లతో తేడాతో వైసీపీ ఓడిపోయింది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ల పునాదులు కదిలే పరిస్థితి వచ్చింది. చేసే తప్పులు, అరాచకాల వల్ల భవిష్యత్తులోనూ వైసీపీ నాయకుల గ్రామాల్లో ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. భయపెట్టి దాడులు చేసినా ముందుకొచ్చి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ప్రకటించిన నాటి నుండి ఎన్నో అవకతవకలతో బలవంతపు ఏకగ్రీవాలు చేసి నల్లచట్టాలకు శ్రీకారం చుట్టారు. ఈ నల్ల చట్టాలతో ఎన్నికల తర్వాత కూడా కేసులు పెట్టి ప్రతిపక్ష అభ్యర్ధులను ఎన్నికలు రద్దు చేయాలని కుట్ర పన్నారు. ఎన్నికలు నిర్వహించేది వైకాపా కాదు..కమిషన్. ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే తర్వాత కేసులు పెడతామని ఎవర్ని బెదిరస్తారు.? పోలీసులను పెట్టి సెటిల్ చేయాలని చూశారు. రౌడీ షీటర్ కింద కేసులు పెట్టి బలవంతపు సరండర్లు చేస్తున్నారు.. ఎర్రచెందనం, లిక్కర్ తెచ్చి మీ ఇంట్లో పెడతాం ఇక మీ ఇష్టం అని బెదిరించారు. అది కూడా వినకపోతే ఎంపీడీవోల చేత కేసులు పెట్టించారు. అయినా టీడీపీ వీరోచితంగా పోరాడింది. మా గ్రామంలో మీ దౌర్జన్యం ఏంటని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చారు. దీంతో ఏకపక్షంగా నామినేషన్లు తిరస్కరించారు. వాలంటీర్లందరూ వైకాపాకే ఓటేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వాలంటీర్ల 50 కుటుంబాల సభ్యులు వైకాపాకే ఓటేయాలని ఎలా చెబుతున్నాడో చూడండి. ఎన్నికలంటే భయంతోనే ఎక్కడా ఎన్నికలు జరగకూడదన్నది వైసీపీ విధానం. ఓడిపోతారన్న భయంతోనే నానా విధాలుగా అరాచకాలు చేశారు. రాత్రి పది గంటల వరకు ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. తర్వాత చీకటి రాజ్యం ప్రారంభమైంది. "

"ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం నుండి బలవంతంగా బయటకు పంపి ఇష్టమొచ్చినట్లు ఫలితాలు ప్రకటించుకున్నారు. కరెంటు కూడా తీసేశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 200 –300 ఓట్ల మెజారిటీతో గెలిచినా మళ్లీ రీకౌంటింగ్ చేయిస్తున్నారు. మూడు సార్లు లెక్కేసి గెలిచినా గెలుపును ప్రకటించడం లేదు. ఎదుటి వాళ్లు 1, 2 ఓట్లతో గెలిస్తే రీకౌంటింగ్ అడిగితే ఇవ్వలేదంటే దీని మతలబు ఏంటి? బలవంతపు ఫలితాలు ప్రకటించుకోవడానికి ఇదంతా చేశారు. రీకౌంటింగ్ పేరుతో స్వస్తిక్ గుర్తు వేయాలంటే అధికారులు డిపార్టు మెంటు ఇచ్చిన సీలును ఇన్ వాలిడ్ చేస్తారు. మీరు చేసిన తప్పులకు ప్రజాస్వామ్యం అపహాస్యం కావాలా, పోటీ చేసిన అభ్యర్థులు నష్టపోవాలా? అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు వారీగా స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి లెక్కిస్తారు. పంచాయతీవి కూడా మండల కేంద్రాలకు తరలించి గట్టిబందోబస్తుతో ఎందుకు లెక్కించరు? ఎవరైనా ఫిర్యాదు చేస్తే సీసీటీవీ వీడీయోలు బయటకు తీసి విచారణ చేసి ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలి. కావాలని ముందు వార్డు మెంబర్లను లెక్కించి ఆలస్యం చేస్తున్నారు. చీకటి రాజకీయం చేయడానికి 10 గంటలు తర్వాత సర్పంచులను ప్రకటిస్తారు. సర్పంచ్ ప్రాధాన్యతను కాబట్టి ముందు వాటిని లెక్కించాలి. ఇష్టానుసారంగా ప్రకటించుకోవడానికి కరెంటు తీసేస్తున్నారు. మేము పోరాడుతుంటే నిన్న సీసీ టీవీల గురించి జీవో ఇచ్చారు. రెండో విడతలో సీసీ కెమెరాలు కవర్ చేయాలన్నారు. ఎన్ని గ్రామాల్లో సిసి కెమెరాలతో నిఘాపెట్టి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది? " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read