ఉండవల్లిలోని ప్రజాదర్బార్ లో న్యాయ విభాగం ఆత్మీయ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ``విభజన కష్టాలున్నా, లోటు బడిజిట్ లోనూ అన్ని వర్గాలకు న్యాయం చేసేముందుకు నా శాయశక్తులా కృషిచేస్తున్నఆనం పేర్కొన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయానికి మీ శక్తి వంచన లేకుండా పాటు పడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 వరకూ అన్ని వ్యవస్థలను కుప్పకూల్చిందని ఆరోపించారు. 2014 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను క్రమపద్ధతిలో నిలపడానికి శ్రమించానన్నారు. న్యాయవాద వర్గానికి ఉన్న సమస్యలను వీలైనంతలో పరిష్కరించడానికి శ్రద్ధ చూపుతున్నామన్ని పేర్కొన్నారు.

cbn 10062018 2

ఈ సందర్భంగా న్యాయవాద వర్గానికి చేకూర్చే పలు ఆర్ధిక ప్రయోజనాలను ఆయన ప్రకటించారు. ప్రధానంగా న్యాయవాదులకు మరణ ప్రయోజనాన్ని బార్ కౌన్సిల్ ప్రకటించిన రూ. 4 లక్షలకు అదనంగా మరో రూ. 4 లక్షలు రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా ఇచ్చి ఆదుకుంటామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ స్టైఫండ్ ను రూ. 5 వేలకు, పుస్తకాల కొనుగోలుకు రూ. 20 వేలు బార్ కోడ్ నమోదుకు రూ. 8 వేలుకు పెంచి అందిస్తామన్నారు. దీనికోసం కోట ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేయడానికి వెనకాడమన్నారు.బీసీ న్యాయవాదు లకు స్టైఫండ్ ను వేయి నుంచి రూ. 5 వేలకు, పుస్తకాల కొనుగోలుకు రూ. 20 వేలు బార్ కోడ్ నమోదుకు రూ. 8 వేలుకు పెంచి అందిస్తామన్నారు. న్యాయవాదులకు జర్నలిస్టులకు మాదిరే అన్ని రకాల వైద్య బీమా వర్తిస్తుందని , ఆ మేరకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.

cbn 10062018 3

ఈ సందర్భంగా చంద్రబాబు ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా అంటూ, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘1995 - 2004 మధ్య రాష్ట్రంలో రెడ్‌అలర్ట్‌.. నేను హైదరాబాద్‌లో హెలికాప్టర్‌ ఎక్కానంటే.. నేరుగా ఏదో ఒక కార్యాయానికి వెళ్లేవాడిని. మొన్నీ మధ్య వచ్చిన సినిమా 2004లోనే నేను చూపించా.. కార్యాలయాలకు వెళ్లి దుమ్ము దులిపిస్తే.. వారి ముఖంపైనే పడేది. మురుగు కాల్వల్లో దింపి కష్టం ఎలా ఉంటుందో తెలియజేశా. సచివాలయంలో ఉమ్మి వేస్తే బకెట్లతో నీళ్లు తెప్పించి కడిగించా.. అన్నీ చేస్తే 2004లో అంతా కలిసి నాపై పడ్డారు అంటూ నవ్వుతూ అన్నారు. ‘ఇప్పుడు కొంత మంది లాలూచీ పడి భాజపాతో చేతులు కలిపారు. శుక్రవారం కోర్టుకు వచ్చి బోనులో నిలబడే వ్యక్తి బయటకు వచ్చి నన్ను తిడతారు.. న్యాయవాదులుగా వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యాలయాలకే పరిమితం కాకుండా 10 నిమిషాలు రాష్ట్రాభివృద్ధికి కేటాయించాలి. మీ దగ్గరకు వచ్చే కక్షిదారులతోపాటు సొంత ఊళ్లకు వెళ్లినప్పుడు అసలేం జరుగుతుందో వివరించే బాధ్యత తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read