ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చేది లేదని, ఆంధ్రప్రదేశ్‌కు పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే, ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం సాయంత్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం టీడీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.! తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని, రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు.

cbn 07032018 2

బీజేపీతో తెగదెంపులు చేసుకుందామని కొందరు టీడీపీ నేతలు సూచించిన నేపథ్యంలో వారికి అనుకూలంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. " కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు లేవా?. కేంద్ర సహకారం లేకుండా వరుసగా గెలుస్తున్న పార్టీలు లేవా?. కేంద్ర సహకారం లేకుండా సీఎంలు అవుతున్న వారు లేరా?. సందిగ్ధం వద్దు... ప్రత్యేక హోదానే మన విధానం. హోదా ఇవ్వాల్సిందే... లేకుంటే మనమంతా పోరాడాల్సిందే" అని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చిచెప్పేశారు. బీజేపీతో విడిపోయే అంశంపై ఆయన చర్చిస్తున్నారు.

cbn 07032018 3

అయితే ఇదే సందర్భంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని మెజార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సమావేశంలో కేంద్రం లీకులపై టీడీఎల్పీలో వాడివేడి చర్చ సాగింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలా?...కొంతకాలం కొనసాగాలా? అని ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయాలు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యేలు.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తేల్చిచెప్పేశారు. అయితే కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పొత్తు కొనసాగాలని చెప్పడం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read