ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా చంద్రబాబు, ఈ రోజు అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ జీఎన్ రావు తన దగ్గర, ఇదే గుంటూరులో పని చేసారని చంద్రబాబు గుర్తు చేసారు. మనకు తెలియని విషయాలు, ఈ మేధావులకు తెలుస్తాయట అంటూ స్పందించారు. చంద్రబాబు మాట్లాడుతూ, "జిఎన్ రావు కమిటీకి ఉన్న విశ్వసనీయత ఏమిటి..? అసలు కమిటీ వెయ్యమని ఎవరు అడిగారు ? నివేదిక ఇవ్వకముందే ప్రశ్నాపత్రాన్ని జగన్మోహన్ రెడ్డి లీక్ చేశారు. లీక్ అయ్యాక పరీక్ష ఈ జీఎన్ రావు రాశారన్నమాట..అది జగన్ కమిటియే తప్ప జిఎన్ రావు కమిటి కాదు. జీఎన్ రావు కమిటి ఇక్కడికొచ్చిందా..? అందరితో మాట్లాడారా..? 30వేల ఎకరాలు మీరిచ్చారు, మీకేం కావాలి, నన్ను రిపోర్ట్ ఇవ్వమన్నారు అని అడిగారా...?" అంటూ చంద్రబాబు స్పందించారు.

gnrao 23122019 2

‘‘ ఏనాడూ ఇళ్లలోనుంచి బైటకు రాని ఆడబిడ్డలు రోడ్డుమీదకు వచ్చారు. పనులన్నీ మానుకుని ఆందోళనలు చేసే పరిస్థితి కల్పించారు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు లేవు. ముక్తకంఠంతో అందరూ అడిగేది న్యాయం చేయమని. సమాజహితం కోరి భూములు ఇచ్చారు. ఒకపక్క 6జిల్లాలు, ఇంకోవైపు 7జిల్లాలకు మధ్యలో రాజధాని పెట్టాం. చంద్రబాబుగా నేను భూములు అడగలేదు, ముఖ్యమంత్రి చంద్రబాబుగా అడిగితే ఇచ్చారు. ఇక్కడ రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. సమాజ హితమే ముఖ్యం. ఆ రోజు ముఖ్యమంత్రిగా నా పిలుపుతో ముందుకొచ్చి 33వేల ఎకరాల భూములిచ్చారు. అసైన్డ్ ల్యాండ్ రైతులకు కూడా న్యాయం చేశాం. ప్రజా రాజధానిని పూర్తిగా దెబ్బతీస్తున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ 4భవనాలతో అభివృద్ది సాధ్యం కాదు. సంపద సృష్టించడం అభివృద్ది అంటే.."

gnrao 23122019 3

అమరావతిపై ఆదాయం రాదన్నారు. గంటలో రూ2వేల కోట్లు బాండ్లు ముంబై స్టాక్ మార్కెట్ లో వచ్చింది అంటే అది అమరావతిపై ఉన్న నమ్మకం. ఇక్కడి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దికి ఇక్కడి సంపదే చాలు. ఇది సంపద సృష్టించే బంగారు బాతు. ధైర్యం ఉంటే హైకోర్టు ద్వారా సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించండి. తప్పు చేసినవారిని శిక్షించండి. మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. నా సవాల్ స్వీకరించండి..కానీ ఆ పేరు చెప్పి అమరావతిని చంపడం అన్యాయం. గొప్ప నగరంగా నిర్మించండి, 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో అన్నది ఇదే జగన్మోహన్ రెడ్డి కాదా..? ఎందుకు మాట మార్చారు, మడమ తిప్పారు..? రాజకీయాలు వద్దు ఇక్కడ..ఇక్కడి రైతులకు కావాల్సింది అమరావతి అభివృద్ది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. అమరావతి ప్రాంత రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ’’ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read