ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ని మార్చాలి అంటూ కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు, కేంద్ర హోం శాఖా మంత్రి రాజనాద్ సింగ్ కు, గవర్నర్ ను మార్చాలి అంటూ రెండు రోజుల క్రిందట లేఖ రాసిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంలో గవర్నర్ మార్పు పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సారి స్పందించారు.. విలేకరులు గవర్నర్ మార్పు పై చంద్రబాబుని అడగగా, ఆయన స్పందించారు...
‘‘గవర్నర్ మార్పుపై ముఖ్యమంత్రిగా నేను స్పందించను. ఎంపీ హరిబాబు రాసిన లేఖ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. లోలోపల ముఖ్యమంత్రికి కూడా గవర్నర్ మీద వ్యతిరేకత ఉన్నా, ఆయన మాత్రం ఇప్పటి వరకు బయట పడలేదు... హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సచివాలయం, తెలంగాణకు ఇచ్చేయమనటం, కీలకమైన బిల్లులు ఆమోదించకుండా లేట్ చెయ్యటం, ఆంధ్రప్రదేశ్ అధికారులతో దురసుగా మాట్లాడటం, తెలంగాణాకు పక్షపాతంగా ఉండటం, ఇవన్నీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విషయాలే అయినా, ఆయన మాత్రం ఇప్పటి వరకు బయట పడలేదు...
వ్యూహత్మకంగా మిత్రపక్షమైన బీజేపీ చేతే చంద్రబాబు విమర్శలు చేపిస్తన్నారు అని టాక్ ఉంది.. గత కొన్ని రోజులుగా గవర్నర్ తీరుపై బీజేపీ నేతలు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఆయన్ను బాహాటంగా విమర్శిస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయంలో గవర్నర్ తీరుపై విష్ణుకుమార్‌రాజు ఘాటు విమర్శలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న గవర్నర్ హైదరాబాద్‌లోనే విధులు నిర్వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలన్నది ప్రజల ఆకాంక్ష. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హరిబాబు లేఖలో కోరారు.