పరిశ్రమలపై దా-డు-లు – పెరుగుతున్న నిరుద్యోగం అనే అంశంపై నిన్న చంద్రబాబు మహానాడులో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ" గత రెండేళ్ల పాలనలో గతంలో తాను రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. కష్టపడి సాధించిన రాష్ట్ర ఇమేజ్ ను నాశనం చేశారు. సంపద సృష్టించడం అంత ఈజీకాదు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించినపుడే పరిశ్రమలు వస్తాయి. ఎన్నికల సమయంలో రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించకుండా యువత భావోద్వేగంతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్య వస్తుంది. పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రావాలని కోరితే ఎందుకు రావాలని అడిగారు, హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును తెచ్చాం, ఐటిని అభివృద్ధి చేశాం. మైక్రో సాఫ్ట్ అధినేత గేట్స్ 10 నిమిషాలు ఇచ్చి 45నిమిషాలు మాట్లాడారు. పట్టుబట్టి సాధించాం. ఐఎస్ బి, నల్సార్, జినోమ్ వ్యాలీ తదితర ప్రఖ్యాత సంస్థలను తెచ్చాం. ఆనాడు మేం చేసిన కృషితో ఇప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయినగరంగా అభివృద్ధి చెందింది. కొత్త రాష్ట్రం వచ్చాక చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తెచ్చాం. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజావేదికతో ప్రారంభమైన వి-ధ్వం-సం నిరంతరం కొనసాగుతోంది. అక్షయ పాత్ర కో ఫౌండర్ మోహన్ దాస్ పాయ్ ఎపి ప్రభుత్వం ఉ-గ్ర-వా-ది-లా వ్యవహరిస్తోందని అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నాలుగేళ్లపాటు సగటున 10.52 శాతం వృద్ది రేటు సాధించాం. అమరావతిని కొనసాగించి ఉంటే 2లక్షల 50వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేవి. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేవి. తమ హయాంలో 50వేల కోట్ల సింగపూర్ స్టార్టప్ సంస్థలను రప్పిస్తే పారదోలారు. లులూ గ్రూపు తో 10సార్లు మాట్లాడి రాష్ట్రానికి రావడానికి ఒప్పించాం. వెంకయ్యనాయుడు సహకారంతో ఆ సంస్థను తెస్తే తర్వాత సాగనంపారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెచ్చాం, అది కూడా వెళ్లిపోయింది. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ స్టీల్స్ ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఎఫ్ డిఐలో 20వస్థానానికి దిగజార్చారు. టిడిపి హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం తెచ్చాం. దేశంలో అతి పెద్ద విదేశీ పెట్టుబడిని కియా మోటార్స్ ద్వారా తెచ్చాం. ఇప్పుడు కియా మోటార్స్ ను కూడా బెదిరిస్తున్నారు. వారిని గందరగోళం చేసి పంపించే కార్యక్రమం చేస్తున్నారు."
"75శాతం స్థానికులకు ఉద్యోగాలు అని బెదిరిస్తున్నారు. పిపిఎలపై లేనిపోని ఆరోపణలు చేసి పారిపోయే పరిస్థితులు తెచ్చారు. 4 ఇన్వెస్టర్స్ మీట్స్ తో 16లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి 32లక్షలు ఉద్యోగాలుకల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5,13,450 ఉద్యోగాలు వచ్చాయని స్వయంగా ఐటి మంత్రే అసెంబ్లీలో చెప్పారు. ఉద్యోగావకాశాల్లో నేడు 27వ స్థానానికి దిగజార్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయి. నిరంకుశ విధానాలు ప్రజాస్వామ్య హక్కులను కాలక్రమంలో హరిస్తాయి. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారు అదే అధికారంతో వ్యవస్థలను లొంగదీసుకోవడం దారుణం. సాధారణంగా అత్యుత్తమ నైపుణ్యాలు, తెలివితేటలు ప్రమాణాలు ఉన్న వారిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తారు. నీలం సాహ్ని నియామకం, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించిన తీరు ప్రజాస్వామ్య పతనాన్ని సూచిస్తున్నాయి. చట్టవిరుద్దమైన నోటిఫికేషన్ వల్ల 160 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో చట్టం అంగీకరించదు, స్థానిక ఎన్నికలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, రాష్ట్రప్రభుత్వం కంగారుగా డివిజన్ బెంచికి అప్పీలు చేసింది. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన పెట్టుబడి దారులపై దా-డు-లు చేస్తే ఎలా వస్తారు? క-రో-నా వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా కంపెనీలు ముందుకు రావడం లేదు. ఎపి ప్రభుత్వ చర్యలు యువత భవిష్యత్ కు శాపంగా మారాయి. రాష్ట్రంలో యువత ఆశలు నాశనం చేశారు, రేయింబవళ్లు ఫైళ్లు పట్టుకొని ప్రపంచం అంతా తిరిగాను, హీరో మోటార్స్ కర్నాటక పోతామంటే బతిమిలాడి మనరాష్ట్రానికి తెచ్చాం. అపోలో టైర్స్, ఫాక్స్ కాన్ వంటి ప్రఖ్యాత సంస్థలను కష్టపడి రాష్ట్రానికి తెచ్చాం. ఇదంతా రాష్ట్ర భవిష్యత్, యువత కోసం చేశాం. ఇప్పుడు పరిశ్రమలను విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. జగన్ ప్రభుత్వ చర్యలకు పరిశ్రమలు పారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ చర్యలపై యువతలో చైతన్యం రావాలి. టిడిపి హయాంలో ఇన్వెస్టిమెంట్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తెచ్చాం. ప్రస్తుత పరిణామాలపై ప్రజాకోర్టులో ప్రజాచైతన్యం తెచ్చి ప్రజలను ఆలోచింపజేయాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను నాశనం చేశాక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు రావు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి పూనుకున్నారు. ఏదేమైనా మన ప్రయత్నం మనం చేయాల్సిందే. "