"వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఇటీవల దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 48 పేజీలతో జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు. "20 పేజీల్లో నేర చరిత్ర, మరో 20 పేజీల్లో ఆర్థిక నేరాలు. 31 కేసులున్న ఏకైక వ్యక్తి జగన్. నేనేమీ నేరాలు చేయలేదన్నట్లు జగన్‌ నటిస్తున్నారు. ఫాం-7తో వైసీపీ నేతలు ఓట్లు తొలగించాలని చూశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశారు. ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు" అని బాబు చెప్పుకొచ్చారు.

108 26112018 1

జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా గత ఐదేళ్లలో కేవలం 23 సార్లు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయనపై ఉన్న కేసుల వాయిదాల కోసం మాత్రం 240సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. పోలింగ్‌ తేదీ శుక్రవారం వస్తే... తన ఓటు తాను వేసుకోలేరు! జగన్‌ వస్తే అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఓట్లే దొంగిలించిన వ్యక్తి ఏ ఒక్కరి భూములను వదిలిపెట్టడు. జగన్‌కు ఓటేసే మోదీకి వేసినట్లేనని ముస్లిం సోదరులు గుర్తించాలి. జగన్‌ ధోరణి ‘లోటస్‌ పాండ్‌ ముద్దు... అమరావతి వద్దు’ అన్నట్లుగా ఉంది. ఒక్కరోజు కూడా ఆయన ఇక్కడ నిద్రపోలేదు. అమరావతి కడితే హైదరాబాద్‌కు పోటీ వస్తుందన్న భయం కేసు కేసీఆర్‌కు పట్టుకుంది. సైబరాబాద్‌ నిర్మాణం తర్వాత అప్పటి కర్ణాటక సీఎం... ‘మీతో పోటీపడలేను. కలిసి పని చేస్తాను’ అని ముందుకొచ్చారు. అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు భిక్షం వేయాలని కేసీఆర్‌ అనుకున్నారట! భిక్షం వేయక్కర్లేదు. విభజన తర్వాత సీమాంధ్రకు దక్కాల్సిన రూ.లక్ష కోట్ల ఆస్తులు ఇవ్వు. హైదరాబాద్‌ ఆస్తులపై మాకూ హక్కు ఉంది!" అని చంద్రబాబు అన్నారు.

108 26112018 1

ఏ పనిచేసినా గౌరవప్రదంగానే.. "దేశంలో ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత మాదే. రూ.24,500 కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. వ్యవసాయంలో 11శాతం వృద్ధి సాధించాం. కరువు, తుపాన్లు వచ్చినా ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లాం. రైతుల జీవితాల్లో వెలుగువచ్చే వరకు అండగా ఉంటాను. రైతులకు అన్నదాత సుఖీభవ నిరంతరం కొనసాగుతుంది. కౌలు రైతులకు ఖరీఫ్‌ నుంచి అన్నదాత సుఖీభవ అమలు. డ్రైవర్ల కోసం సాధికార సంస్థ ఏర్పాటు చేశాం. నేనూ ఓ డ్రైవర్‌గా రాష్ట్రానికి సురక్షిత పాలన అందిస్తున్నా. అన్నా క్యాంటీన్లతో రుచికరమైన భోజనం అందిస్తున్నాం. కేఎఫ్‌సీ స్థాయిలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఏ పనిచేసినా గౌరవప్రదంగా, పద్ధతిగా చేశా. ఒకే ఏడాదిలో పట్టిసీమను పూర్తిచేసి కృష్ణాడెల్టాకు నీరిచ్చా. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించాం పట్టిసీమకు వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. కాల్వలకు గండి కొట్టి దుర్మార్గంగా, అమానుషంగా ప్రవర్తించారు. రాజధానికి రైతులు భూములిస్తే చెరుకు తోటలను తగులబెట్టారు" అని వైసీపీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read