సోమవారం ఉండవల్లిలోని నివాసంలో తెదేపా ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 15 రోజులుగా జాతీయ, రాష్ట్రస్థాయి పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పీపీఏలను రద్దుచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం చెప్పారని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు పేరు మార్పు తప్పు కాదని, అయితే పథకాలను తొలగించడం సరికాదని భేటీలో నేతలు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని సీఎం జగన్ చెప్పడం.. టీడీపీ హయాంలో అసలు అవినీతి జరగలేదని ఒప్పుకోవడమేనని నేతలు వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన పనులన్నీ టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి కొన్నింటిని పూర్తి చేసిందని, మరికొన్ని చివరిదశకు వచ్చాయని నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటిని ఆపేసి అవినీతి బురదల జల్లడం కరెక్ట్ కాదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇస్తామన్న జగన్.. ఇప్పుడు మళ్లీ తామే చేస్తామనటాన్ని కూడా ఈ భేటీలో ప్రస్తావించారు.

jagan 11062019

ఇప్పటికే రైతులు ఒక పంట కాలాన్ని కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4వేల కోట్లు తెచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో నీటి కొరత నివారణకు అనేక ప్రాజెక్టులు ప్రారంభించిందని, ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా అవన్నీ రద్దు చేస్తామనడం కరెక్టు కాదని అన్నారు. రైతులకు రావాల్సిన రుణమాఫీ 4వ విడత, 5వ విడత కిస్తీలను వెంటనే చెల్లించేలా ఒత్తిడి తేవాల్సిఉందన్నారు. అదేవిధంగా రైతు భరోసా కూడా అక్టోబర్ 15 నుంచి అంటున్నారని, ఇది సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల ఈ ఖరీఫ్‌లోనే రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం అందకుండా పోతుందని, ఈ నిర్ణయం సరికాదన్నారు.

jagan 11062019

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, ఇతర పనులన్నీ నిలిచేపోయే పరిస్థితి తెచ్చారని అన్నారు. పీపీఎలను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేర్కొంటే.. కేంద్ర ఇంధన కార్యదర్శే దానికి అభ్యంతరం చెప్పడాన్ని నేతలు ఈ భేటీలో గుర్తుచేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు నిలిచిపోయేలా చేయవద్దని కొత్త ప్రభుత్వానికి సూచనలు చేశారు. ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని, అభివద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమంలో ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ భేటీలో నేతలంతా ముక్త కంఠంతో స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read