ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఘంటా మురళి పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆయన తన ప్రసంగం ఆద్యంతం కేసీఆర్, జగన్, మోదీ త్రయంపై నిప్పుల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం ఓ పెద్ద నాయకుడిలా మాట్లాడుతున్నాడని, ఏపీ డేటాతో తనకేం పని? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ డేటా పోతే బాధపడాల్సింది తామని, కానీ కేసీఆర్ కు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణలో 27 లక్షల ఓట్లు తీసేయిస్తే ఎవరూ మాట్లాడలేదని, కానీ ఏపీలో కూడా అదే తరహాలో దౌర్జన్యం చేయాలనుకుంటున్నాడని, కానీ ఆయన ఆటలు ఇక్కడ సాగవన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

modi 12032019

"నువ్వేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నావు, కానీ నీకు 100 రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చే సత్తా నాకుంది. నా దగ్గర పనిచేసిన నీకే ఇంత రోషం ఉంటే నాకెంత ఉండాలి? హైదరాబాద్ లో ఇవాళ ఆదాయం వస్తోందంటే అది నీ శ్రమ కాదు, మా కష్టార్జితం" అంటూ మండిపడ్డారు చంద్రబాబు. ‘జగన్‌కు ఈ గడ్డపై నమ్మకం లేదు.. ఇక్కడి ప్రజలపై విశ్వాసంలేదు. అమరావతిపై అభిమానం లేదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘పాదయాత్ర సమయంలో తప్పితే ఎప్పుడూ రాష్ట్రంలో ఆయన బస చేయలేదు. గత అయిదేళ్లలో ఆయన రాష్ట్రంలో ఎన్నాళ్లున్నారు’ అని నిలదీశారు. సోమవారం చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించిన ఆయన ఇప్పుడు నీతి నిజాయతీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

modi 12032019

రెండు మూడు రోజుల్లో అభ్యర్థులపై ఒక స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం పార్టీ కేడర్‌ను సంసిద్ధం చేసేందుకు వారితో సమావేశమవుతానన్నారు. తిరుపతితో ప్రారంభించి 4 రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు పూర్తి చేస్తామని తెలిపారు. జగన్‌ గతంలో తండ్రిని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించి దొరికిపోయి అందర్నీ జైలుకు తీసుకెళ్లారని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అందరూ జైలు పాలవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి కావాలన్న కల తప్ప, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదని ధ్వజమెత్తారు. తెరాస, భాజపాలతో కుమ్మక్కై బందిపోట్లలా రాష్ట్రం మీదకు వస్తున్నారన్నారు. ఐదేళ్లలో అమరావతికి వచ్చి ఒక్క రాత్రి కూడా ఉండని జగన్‌ ఈ రాష్ట్రంపై ఏం శ్రద్ధ చూపుతారని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read