కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత నాలుగు బడ్జెట్లలోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో చంద్రబాబు మాట్లాడుతూ, భాజపాతో ఉండబోదని తెదేపా నిర్ణయించిందని, ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. సెంటిమెంట్‌తో నిధులు రావని జైట్లీ ఎలా చెబుతారు, తెలంగాణ రాష్ట్రాన్ని సెంటిమెంట్‌ ద్వారానే ఇచ్చిన సంగతి ఆయనకు తెలీదా? విభజన చట్టంలో ఉండే హామీలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నా అని చంద్రబాబు అన్నారు...

cbn modi 16032018 2

ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోమని అడిగితే.. రక్షణ శాఖ బడ్జెట్‌ ప్రస్తావన ఎందుకు తెస్తారు. దేశ రక్షణను పణంగా పెట్టి మమ్మల్ని ఆదుకోమని మేం అడిగామా? 'మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా, మీ ఒక్కరికే దేశభక్తి ఉందా, మాకు లేదా?' అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదు. పోలవరంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. భూసేకరణ అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలని సాక్షి పత్రికలో రాశారు. పోలవరానికి అడ్డంకులు సృష్టించి రాష్ట్రాభివృద్ధికి అడ్డుకట్టవేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

cbn modi 16032018 3

తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని, వెనక్కుతగ్గే సమస్యే లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తమ మనోభావాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరు అంటే, చిన్న పిల్లాడు కూడా, మోడీ అని చెప్తారు... అలాంటి వారి పై పోరాడుతుంటే, నా పై కుట్రలు చేస్తారా అంటూ మండిపడ్డారు... హామీ ఇచ్చింది చెయ్యమంటే, మమ్మల్ని కేసులు పెడతాం అంటున్నారు, తమిళనాడు తరహా కుట్రలు చేస్తాం అంటున్నారు... రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధం... మీ కుట్రలు తిప్పి కొడతాం... మీ నాటకాలు మా రాష్ట్రంలో కాదు అంటూ, మోడీని హెచ్చరించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read