విజయవాడలో ‘ఆదరణ పథకం’ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు... ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై, ప్రజల మధ్య వారికి సూటి ప్రశ్నలు వేసారు... కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై విమర్శలు గుప్పించడం ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ల పాటు కనపడని అవినీతి పవన్ కల్యాణ్‌కు ఈ రోజు కనపడిందా? అని నిలదీశారు. తనను విమర్శిస్తే పవన్ కు వచ్చే లాభం ఏంటని అన్నారు.
రాష్ట్రానికి ప్రస్తుత్వం, ఉన్న ఈ కష్ట సమయంలో ఎవరయినా మాట్లాడాల్సింది మన హక్కులపై అని, నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు... హక్కుల కోసం పోరాడకుండా తనను విమర్శిస్తున్నారని తెలిపారు... నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ రోజూ ఎవరికీ భయపడలేదని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరానని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము పోరాడుతున్నామని చెప్పారు... రాష్ట్ర విభజన పేరుతో ఆపరేషన్ చేసి తల్లిని చంపారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ తల్లిని కాపాడాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు అని అన్నారు... తమిళనాడు తరహా కుట్ర చేస్తున్నారని, నా మీద కేసులు పెడతా అంటున్నారని, నేను ఎవరికీ భయపడను అని, రాష్ట్రం జోలికి వస్తే చూస్తూ ఊరుకొను అని చెప్పారు...
అంతకు ముందు, అసెంబ్లీ స్పందిస్తూ, త్త వ్యక్తులు, పార్టీలు లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, వారి బండారం త్వరలోనే బయటపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదని హితవు పలికారు. రేపో, ఎల్లుండో అన్నీ బయటపెడతా. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాం. లాలూచీ పడి రాష్ట్ర హక్కులను తాకట్టు పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు...