ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో, పత్రికా స్వేఛ్చ పై, ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుందని అవేదన వ్యక్తం చేసారు. ఒక యుట్యూబ్ ఛానల్ అధినేత ఆచూకీ కోసం, వారి బంధువులను కిడ్నాప్ చేసారు అంటూ, చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. సొంత మీడియాలో ఎవరిమీదయినా ఎంతటి అసత్య ప్రచారమైనా చేసుకోవచ్చు, వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలతో కప్పిపుచ్చవచ్చు, కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్లయినా నిజాలు చెబితే వైసీపీ నాయకులు కుతకుతలాడిపోతారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ బండారం బయట పెట్టిన, మీడియా ప్రతినిధులపై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారు అంటూ, ప్రభుత్వం పై మండి పడ్డారు.

మైరా టీవీ ఛానల్ అధినేత ఆచూకీ కోసం వారి బంధువులను, మీడియాతో సంబంధం లేనివారిని పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అరాచకాన్ని టీడీపీ ఖండిస్తోందని, ప్రభుత్వం వెంటనే వారిని, వారి కుటుంబాలకు అప్పగించాలి డిమాండ్ చేసారు. దీని పై టీడీపీ న్యాయపోరాటం చేస్తుందని అన్నారు. అవసరం అయితే మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తాం అని అన్నారు. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకోం అని, మీడియా పై ఈ వైఖరి కరెక్ట్ కాదని అన్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఈ విషయం పై స్పందిస్తూ, జీఓ 2430ను ఉపయోగించి, తమను ప్రశ్నిస్తున్న వారి పై, ఒత్తిడి టెస్టు, పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.

మరో పక్క రెండు రోజుల క్రితం, తెలుగు వన్ అనే యుట్యూబ్ ఛానెల్, అలాగే థర్డ్ ఐ అనే ఛానల్ పై కూడా పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. థర్డ్ ఐ అనే ఛానల్ నిర్వాహకుడు, అంజి బాబుని, పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే హైదరాబాద్ లో ఉండే తెలుగు వన్ అనే ఆఫీస్ పై, ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు దాడి చేసి, వాళ్ళ సర్వర్లు, హార్డ్ డిస్క్ లు తీసుకు వెళ్లారు. ఇదే విషయం పై, గత రెండు రోజులుగా గోల జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మైరా మీడియా అనే ఛానల్ నిర్వాహకుడి ఆచూకీ కోసం, ఇలా చేసారు. అయితే, ఇది నిజమా కదా, మైరా మీడియా నిర్వాహకుడి కోసం, ఎందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు, కేసు ఏమిటి అనేదాని పై, క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు, ఈ విషయం పై పోలీసులు స్పందించ లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read