అగ్రి గోల్డ్‌, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీల నేరాల కంటే వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన ఆర్థిక నేరాలు తీవ్రమైనవని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అగ్రి గోల్డ్‌ ఆస్తుల్లానే జగన్‌ ఆస్తుల్నీ వేలం వేయాలని డిమాండు చేశారు. ‘అగ్రి గోల్డ్‌కు ఒక రూలు? జగన్‌కు మరో రూలా?’ అని ధ్వజమెత్తారు. ఐదు ఎంపీ పదవుల్ని చూపించి, రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రానికి జగన్‌ తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నమ్మక ద్రోహం చేసిన భాజపాకు, దానికి మద్దతిస్తున్న వైకాపాకు, ఇతర నాయకులకూ కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అసమర్థులు, అవినీతిపరులకు అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్‌ కోలుకోలేని దెబ్బతింటుందని, మరో బీహార్‌లా మారుతుందని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.

cbn 10062018 2

‘అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ న్యాయస్థానం ద్వారా వేలం వేస్తున్నాం. ఆ సంస్థ వాళ్లు అప్పులు చేసి ఆస్తులు కొన్నారు. కానీ అప్పులు తీర్చలేదు. దీంతో వారి వ్యక్తిగత ఆస్తులూ వేలం వేస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విషయంలో అది ఎందుకు వర్తించదు? అతడిదీ మోసమే. ప్రజలు కూడా ఆలోచించాలి. నీరవ్‌ మోదీ అప్పులు చేశారు. తీర్చకుండా చేతులెత్తేశారు. అగ్రిగోల్డ్‌, నీరవ్‌ మోదీ కంటే జగన్‌దే ఎక్కువ నేరం. అవినీతితో ఆస్తులు పోగేశారు. అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసుల్లో జరిగినట్లు జరగడం లేదు. ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నీరుకార్చడం లేదా? ఎవరీ పని చేస్తున్నారు?' అని చంద్రబాబు అన్నారు.

cbn 10062018 3

'రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై పోరాడుతున్నాం. కానీ వైసీపీ నాయకుడు.. నాడు బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేశారు. ఇప్పుడు ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారు. రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఎన్నికలు రాకుండా లగ్నం చూసి రాజీనామాలు ఆమోదించుకుంటారు. ఇదో నాటకం-బూటకం. కాంగ్రెస్‌ మోసం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిన బీజేపీకీ అంతకంటే ఎక్కువ బుద్ధి చెబుతారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శనివారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక కష్టాలు, కుమ్మక్కు రాజకీయాలతో సృష్టించిన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు దీనికి పెద్దఎత్తున సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read