పవన్ కళ్యాణ్ ఏమి సాధించాలనుకుంటున్నారు ? తనకు ఉన్న అత్యధిక మంది యువ ఫాన్స్ కి ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు ? వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా మార్చాలని అనుకుంటున్నారా ? అసలు పవన్ లక్ష్యం ఏంటి ? ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల్లో తిరిగే సమయంలో, తన పార్టీ గురించి చెప్పుకోవాలి కాని, ఎంత సేపు తన సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నాడు ? ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు ? వీటి అన్నిటికీ జవాబు ఆపరేషన్ గరుడేనా ? శాంతి బధ్రతల సమస్య లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాడా ? కులాల గొడవలకు ప్లాన్ చేస్తున్నాడా ? ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం రోజు రోజుకీ రెచ్చిపోతున్నాడా ? పవన్ ప్రసంగాలు, జరుగుతున్న పనులు చూస్తే అవును అనే అనిపిస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా, ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే పార్టీ శ్రేణులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ట్రాప్‌లో పడకుండా టీడీపీ హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన్ వరుసగా విమర్శలు చేస్తున్నా టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వాటిని రాజకీయాంగా తిప్పికొడుతోంది తప్ప పవన్ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ పార్టీ నేతలకు డైరక్షన్ ఇస్తున్నారు. ఎవరి ట్రాప్‌లో పార్టీ నేతలు పడకుండా దిశానిర్దేశం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రాప్‌లో అసలు టీడీపీ నేతలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్‌లే టార్గెట్‌గా జనసేనాని విమర్శలు చేశారు. కానీ తాజాగా పవన్ వ్యూహం మార్చారు. ప్రస్తుతం పశ్చిమలో పర్యటిస్తున్న పవన్ ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చింతమనేని దూకుడుతో, ఆయన పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారేమో అని అందరూ భావించారు. కాని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలతో ఎక్కడా బ్యాలన్సు తప్పలేదు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు చూస్తుంటే కచ్చితంగా అది ప్రాంతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి, ఆయన ఎంత రెచ్చగొట్టే విధంగా పర్సనల్‌గా టార్గెట్ చేసినా వాటిని రాజకీయంగానే తిప్పికొట్టాలి తప్ప వేరే విధంగా తీసుకోవద్దని పార్టీ నేతలకు సూచిస్తున్నారు చంద్రబాబు. ఇదే ఇప్పుడు పవన్ ను మరింత ఇరిటేట్ చేస్తుంది. అందుకే, రోజు రోజుకీ పవన్ సంయమనం కోల్పుతూ, వ్యాఖ్యలు చేస్తున్నారు.