ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు.. తనను అవహేళన చేస్తున్నారని చెప్తూ తనది బలహీనత కాదని.. మిత్రధర్మం పాటిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడుతుంటే.. తనను బలపర్చకుండా బలహీనపరుస్తారా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. తనకు మనుషులు కాదు.. దేశం, రాష్ట్రం ముఖ్యమని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఢిల్లీతో లాలాచీ పడ్డారంటూ, లాలూచీ పడ్డ వారెవరో త్వరలోనే బయటపెడతానని, అన్నిటికీ రెండుమూడ్రోజుల్లో సమాధానం చెబుతానని అన్నారు.

cbn 15032018 2

‘కేంద్రంపై నేను పోరాడుతున్నాను. దేని కోసం పోరాడుతున్నాం? నాలుగేళ్లుగా కేంద్రాన్ని అడిగాను. ఈ నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ తిరిగాను. ‘నాది బలహీనత’ అని కొంతమంది అంటున్నారు. నాది ధర్మం. మిత్రధర్మం. 29 సార్లు తిరిగిన తర్వాత, నాలుగేళ్లపాటు ప్రయత్నం చేసిన తర్వాత సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, విధిలేని పరిస్థితిలో పోరాటం ప్రారంభించాను. నేను ఒక్కడినే ఇప్పటికీ ఢిల్లీ పై పొరాడు తన్నా, ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నాను.

cbn 15032018 2

పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు, ఏపీలో మనం పోరాడుతుంటే.. ఒక్కొక్కరూ ఒక్కొక్క లాలూచీ రాజకీయాలతో నన్ను విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రధాని అన్యాయం చేస్తున్నారని నేను గళం విప్పినప్పుడు, నన్ను బలపర్చాల్సిన మీరు (విమర్శించే వాళ్లు) బలహీనపరుస్తారా? అది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం లాభం చేకూర్చదు. తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నాను. ఎన్నో రాజకీయాలను చూశాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా లాలూచీ పడ్డారు. ఎవరెన్ని చేసినా ‘ట్రూత్ ఈజ్ ట్రూత్’. నిజం నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటమాడాలని చూడొద్దు భవిష్యత్ లో ఎవరికీ కలిసి రాదు’ అని చంద్రబాబు భావోద్వేగం చెందారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read