గత వారం రోజులుగా, విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఈ రోజు పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాల పై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చర్చించారు. ప్రజావేదిక కూల్చివేత, పార్టీ ఫిరాయింపులు, టీడీపీ శ్రేణుల పై, వైసీపీ చేస్తున్న దాడుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక పై, అక్కడ ఉన్న నేతలతో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బుతో కట్టిన, ప్రజా వేదికను కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వటం, సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో అనేక చోట, వైఎస్ విగ్రహాలు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా వేదిక, నేను సొంత డబ్బులతో కట్టింది కాదని, ప్రభుత్వం ఖర్చుతో కట్టింది అని, తన పై కక్ష తీర్చుకోవటానికి, ప్రభుత్వ సొమ్ముని నాశనం చెయ్యటం కరెక్ట్ కాదని చంద్రబాబు అన్నారు. కట్టడం చాలా కష్టం అని, కూల్చటం చాలా తేలిక అని చంద్రబాబు అన్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా, టీడీపీ కార్యకర్తల పై జరగుతున్న దాడులను చంద్రబాబు ఖండించారు. ఈ రోజు ప్రకాశం జిల్లాలో జరిగిన దాడిని, నర్సరావుపేటలో దళిత వైద్యుల పై వైసీపీ వర్గీయలు చేసిన దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఒక్క నెల వ్యవధిలోనే తెలుగుదేశం కార్యకర్తల పై 130కి పైగా దాడులకు వైసీపీ తెగబడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్పటానికి, ఇదే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు కక్ష సాధింపులో భాగంగా భద్రత తగ్గించడం పై కూడా చర్చించారు. భద్రతను తగ్గించి ప్రాణాలతో చెలగాటం ఆడే కక్ష సాధింపు చర్యలు మానాలని, ఇది రాజకీయల్లో మంచిది కాదని చంద్రబాబు అన్నారు. ప్రజా ధనంతో నిర్మించిన భవనాలను కూల్చి, ఏ సందేశం ఇస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విత్తనాల కొరత తీవ్రంగా ఉందని, దానిని పరిష్కరించాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read