జగన్ సర్కార్ పై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, ధ్వజమెత్తారు. దిశా చట్టం చేసామంటూ, హడావిడి చేసిన ప్రభుత్వం, అమలులో, ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసారని, ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ కల్పించాలనే, చిత్తశుద్ధి, నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె, ఈ వరుస అత్యాచారాలు, మహిళల పై ఎందుకు ప్రశ్నించారు. రాజమండ్రిలో ఒక దళిత మహిళను, నాలుగు రోజుల పాటు, నిర్బంధించి, సామూహిక అత్యాచారం చేసారని, చివరకు ఆ బాలికను, నిందితులే పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి, పోలీసులకే సవాల్ విసిరారని అన్నారు. అత్యాచారం చేసి పోలీసులకే సవాల్ విసిరారు అంటే, రాష్ట్రంలో నేరస్తులు ఎలా పేట్రేగిపోతున్నారో అర్ధం అవుతుందని అన్నారు. రాజమండ్రి ఒకటే కాకుండా, రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం పై ప్రశ్నలు వర్షం కురిపించారు చంద్రబాబు. 

జగన్ వచ్చిన ఈ 14 నెలల్లో, 400కు పైగా అత్యాచారాలు జరిగాయని, 16 గ్యాంగ్ రేపులు జరిగాయని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక బాలిక, నెల్లూరులో మరో బాలిక, అనంతపురంలో ఒక బాలిక, గుంటూరులో మరో బాలిక, ఇలా జరుగుతూ ఉన్నాయని, ఇప్పుడు రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనను కూడా ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను, ఎండగట్టారు చంద్రబాబు. నెల్లూరులో ఎంపీడీవో పై, చిత్తూరులో మహిళా డాక్టర్ పై, మాస్కు అడిగినందుకు మహిళా ఉద్యోగి పై దాడి, ఇవన్నీ మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం అని, పాలకులు స్వప్రయోజనాల కోసం, వ్యవస్థలను నాశనం చేస్తే, దాని ప్రయోజనాలు ఇలాగే ఉంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయం పై కఠినంగా ఉండాలని, బాధితులకు న్యాయం చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read