ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా వల్ల అతలాకుతలం అయిన కుటుంబాలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కరోనా బాధితుల డిమాండ్ల అమలు కోసం సాధన దీక్ష జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ దీక్షలు జరిగాయి. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో, టిడిపి అధినేత చంద్రబాబు, సాధన దీక్షలో పాల్గున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగం చేసారు. ఆయన మాట్లాడుతూ, క-రో-నా మన దేశానికి రాక ముందే, వివిధ దేశాలకు పాకుతున్న సమయంలోనే, జగన్ మోహన్ రెడ్డిని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని, క-రో-నా కేసులు నెమ్మదిగా పెరుగుతున్న సమయంలో, మాస్కు పెట్టుకోవాలి, సానిటైజర్ వాడాలి, ఇలా జాగ్రత్తలు చెప్తుంటే, తనని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇది అసలు భయపడేది కాదు, చిన్న జ్వరం లాంటిది, దీని గురించి పట్టించుకోవద్దు, బ్లీచింగ్ చల్లితే చాలు అనే విధంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసారు. తరువాత సెకండ్ వేవ్ లో, జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా చేతులు ఎత్తేసిన విషయాన్ని గుర్తు చేసారు. కనీసం హాస్పిటల్ లో బెడ్లు దొరకని పరిస్థితి వచ్చిందని, మందులు కూడా బ్లాక్ లో అమ్ముకున్నారని, ఆక్సిజన్ అందించలేక,అనేక మంది చనిపోయారని, దీనికి ప్రభుత్వం కాక, మరి ఎవరు బాధ్యత వహించాలి అంటూ, చంద్రబాబు ప్రశ్నించారు.

cbn 290062021 2

ఇక ఈ క-రో-నా కాలంలో, మధ్య తరగతి ప్రజలు కూడా అన్నం దొరక్క ఇబ్బంది పడ్డారని గుర్తు చేసారు. అయుదు రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎందుకు మూసివేసారు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పక్కన ఉన్న తమిళనాడులో స్టాలిన్ వచ్చిన తరువాత కుడా అక్కడ అమ్మ క్యాంటీన్లు కొనసాగించారని గుర్తు చేసారు. అమ్మ క్యాంటీన్ల పై వారి పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే దాన్ని తప్పు బట్టిన స్టాలిన్ సొంత పార్టీ వారి పైనే చర్యలు తీసుకున్నారని, జయలలిత ఫోటో పెట్టి మరీ క్యాంటీన్లు ఉండాల్సిందే అని చెప్పారని, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం అంటే ఇదే అని అన్నారు. ఇక క-రో-నా మరణాల పై చంద్రబాబు జగన్ కు చాలెంజ్ చేసారు. జగన్ మోహన్ రెడ్డికి దమ్ము ఉంటె, అధికారకంగా చనిపోయారు అని చెప్తున్న ఆ 3 వేల మంది పేర్లు చెప్పాలని చాలెంజ్ చేసారు. అప్పుడు అసలు నిజం తెలుస్తుందని అన్నారు. ప్రతి మే నెల కంటే, ఈ సారి లక్ష మరణాలు ఎక్కువగా నమోదు అయితే, ఈ ప్రభుత్వం మాత్రం, తప్పుడు లెక్కలు చూపిస్తుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read