మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నిన్న వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చెప్పిందన్నారు. ఇక తెరాస పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వే ప్రకారం తెరాసకు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడిన కేసీఆర్‌.. ఇప్పుడు తెరాస ఓడిపోతుందని చెబితే ఆయనపై విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాకూటమి అధికారం సాధించే అవకాశం ఉందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు.

cbn 05122018

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చంద్ర గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రజాకూటమి బలపరిచిన తెదేపా అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాసను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'నిన్ననే లగడపాటి చెప్పారు... అయిపోయింది తమ్ముళ్లూ... మొత్తం అయిపోయింది' అంటూ కేసీఆర్ ఓడిపోతున్నారనే విధంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి నీతి, నిజాయతీ లేదని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ టీడీపీలోనే పుట్టి, టీడీపీలోనే పెరిగారని అన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడుండేవారని ప్రశ్నించారు.

cbn 05122018

పెద్ద మోదీ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ అయితే... కేసీఆర్ చిన్న మోదీ అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శించారు. తాను హైదరాబాదును కట్టలేదని, సైబరాబాదును నిర్మించానని చెప్పారు. మిషన్ భగీరథ పూర్తయ్యేంత వరకు ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్... ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా ఏపీలో 10 లక్షల ఇళ్లు కట్టాం. మొత్తం 25 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. తెలంగాణలో అద్దె ఇంట్లో ఉండే వాళ్లకి 50 వేలు గ్రాంట్‌ ఇచ్చి, ఇళ్లు కట్టించే బాధ్యత ప్రజా కూటమి తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read