ఈ రోజు జరిగిన తిరుపతి ఉప ఎన్నిక ఫలితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నిక ఫలితంలో వైసీపీకు 6,26,108 ఓట్లు వచ్చాయి. అలాగే తిరుపతిలో టీడీపీకి 3,54,516 ఓట్లు వచ్య్యై. ఇక బీజేపీ-జనసేనకు కలిపి 57,080 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‍కు పార్టీకి వచ్చిన ఓట్లు 9,585 కాగా, సీపీఎంకు వచ్చిన ఓట్లు 5,977. అలాగే నోటాకు వచ్చిన ఓట్లు 15,568. మొత్తం మీద తిరుపతిలో నాలుగో స్థానంలో నోటా నిలిచింది. ఇక తిరుపతి ఉప ఎన్నిక ఫలితం పై, తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలకు ఎదురు ఉండి పోరాడిన టిడిపి శ్రేణులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను, నాయకులను అభినధించారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఓటింగ్ శాతం తగ్గటం, వారికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుందని అన్నారు. అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై, టిడిపి కార్యకర్తల పోరాటం స్పూర్తిదాయకం అని అన్నారు. అన్ని అరాచకాలు చేసినా, దొంగ ఓట్లు వేసినా, వారు అనుకున్న అయుదు లక్షల మెజారిటీ సాధించలేక పోయారని , వారి అహంభావానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తిరుపతి ప్రజలకు అభినంధనలు తెలిపారు.

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందిస్తూ, "తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ గెలుపు వైసీపీ నాయకులందరినీ ఆత్మపరిశీనలో పడేసింది నిజం కాదా.? రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్లే ఈ గెలుపు మీకు లభించిందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఫేక్ ఓటర్ కార్డులు ఎక్కడ తయారు చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుసు. వారిద్దరూ లై-డిటెక్టర్ టెస్టుకు సిద్ధ పడితే తిరుపతి గెలుపు ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. లక్షలాది మంది దొంగ ఓటర్లను తిరుపతికి దిగుమతి చేసింది నిజం కాదా?. ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాకు తెలీదని తిరుపతి వెంకన్న సమక్షంలో ప్రమాణం చేయగలరా?. పోలింగ్ రోజున తిరుపతి పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వారి అనుయాయులు సృష్టించిన అరాచకాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు, రెండు జిల్లాల్లోని అధికారులు అడ్డుకుంటే ఈ విజయం వైసీపీకి దక్కేది కాదు. సీఎం గుండె మీద చేయి వేసుకుని చెప్పండి.. ఇది ప్రజలు ఇచ్చిన అధికారమా? ఎన్నికలు జరిగిన విధానాలపై నిజానిజాలు మాట్లాడే ధైర్యం వుంటే రేపు మీడియా ముందు వాస్తవాలు మాట్లాడాలని సవాల్ విసురుతున్నా." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read