అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన టిడిపి అధినేత చంద్రబాబు,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అచ్చెన్నాయుడు భార్యా బిడ్డలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్. కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన విధానంపై కుటుంబ సభ్యుల ఆవేదన. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు,లోకేష్. టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు,లోకేష్. కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్. ఆధారాలు లేకుండా అక్రమ అరెస్ట్ చేశారనే విషయం అధికారుల ప్రెస్ మీట్ ద్వారా బయటపడింది .

ప్రెస్ మీట్ లో అధికారుల టెన్షన్, మాటల్లో తడబాటే అందుకు నిదర్శనం. వారిపై సీఎం జగన్ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో వారి ముఖ భావాలే చెప్పాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మరోసారి జగన్ రాజ్యాంగాన్ని ఖూనీ చేసారు. చట్ట నిబంధనలను తుంగలో తొక్కారు. దేశం అంతా ఒక రాజ్యంగం అమల్లో ఉంటే, మన రాష్ట్రంలో జగన్ సొంత రాజ్యాంగం అమలు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. అచ్చెన్న కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుంది. బీసి సంఘాలన్నీ అండగా ఉంటాయి. అచ్చెన్న అరెస్ట్ రాజ్యాంగంపై జగన్ దాడి. పౌరుల ప్రాథమిక హక్కులపై జగన్ దాడి. బిసిలను అణిచివేసే వైసిపి కుట్రగా పేర్కొన్న చంద్రబాబు, లోకేష్

Advertisements

Advertisements

Latest Articles

Most Read