కేంద్ర ఎన్నికల అధికారితో పాటుగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసేందుకు, అధికార పార్టీ చేస్తున్న అరాచకాన్ని వారికి స్వయంగా తెలిపారు. పెద్ద ఎత్తున లారీల్లో, బస్సుల్లో, సుమోలలో, పక్క నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను డంప్ చేస్తున్నారని, చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని చోట్ల జరుగుతున్న అరాచకాల పై చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు చంద్రబాబు. దొంగ ఓటర్లను కళ్యాణమండపాల్లో, అపార్ట్ మెంట్ ల్లో ఉంచారని, ఆ లిస్టు కూడా చెప్పారు. వెంటనే దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకోవాలని చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేసారు. వారి పై వెంటనే చర్యలు తీసుకుని, ఇది అడ్డుకట్ట వేసి , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు చంద్రబాబు నిన్న రాత్రి కూడా లేఖ రాసారు. అయినా ఎక్కడ అడ్డుకట్ట వేయలేకపోయారు.
కేంద్ర ఎన్నికల అధికారికి చంద్రబాబు ఫోన్...
Advertisements