ఫొని తుపానుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో సీఎం అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు ఇచ్చిన అంచనాలపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ మేరకు ఫోన్‌లో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నవీన్‌కు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తుపాను విపత్తు సమయంలో రూ.30 కోట్ల విలువైన సామగ్రిని ఒడిశాకు పంపించిన విషయాన్ని అధికారులకు గుర్తుచేశారు.

cbnphone 02052019

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు.. 200 గ్రామాలపై ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని సీఎంతో విపత్తుల ప్రత్యేకాధికారి వరప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు తెలిపారు. 120 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించారు. టెక్కలి, పలాస కేంద్రాలుగా సహాయక బృందాలు పనిచేస్తాయని స్పష్టంచేశారు. మండల కేంద్రాల్లో కాకుండా తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సహాయ బృందాలు అందుబాటులో ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే పాలు, తాగునీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో తుఫాన్ బాధితులకు ఆహారం, ఇతర వసతులు కల్పించాలన్నారు. విశాఖ కేంద్రంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు పంపాలని సూచించారు.

cbnphone 02052019

శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బారువా నుంచి ఎర్రముక్కం వరకు 30 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. ‘ఫణి’ తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్దానం మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గురువారం ఉదయం వజ్రపుకొత్తూరు మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో పాటు కొంతమేర ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సాయంత్రానికి గాలుల తీవ్రంత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో పలాస, సోంపేట, కవిటి, వజ్రపు కొత్తూరు మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. వంశధార, నాగావళి నదుల ముంపు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read