రాష్ట్రంలో గత రెండు నెలలుగా పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాని. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ఇసుక లేక నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోవటంతో, 20 లక్షల మంది కూలి పని చేసుకునే వారికి పనులు లేవు. ఇక మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా నేమ్మదించాయి. పోయిన నెల తమ నాయన పుట్టిన రోజు అని చెప్పి, 8 వ తారీఖున పెన్షన్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రతి సారి ఫస్ట్ తారీఖున ఉద్యోగులకు జీతాలు పడేవి. ఈ సారి రెండు రోజులు ఆలస్యం అయ్యింది. ఎందుకు అని ఆరా తీస్తే, ఎదో సాంకేతిక సమస్య అని చెప్పింది ప్రభుత్వం. అలాగే ప్రతి నెలా పెన్షన్ లు తీసుకునే ముసలి వారికి, వికాలంగులుకు కూడా ఈ సారి పెన్షన్ లేట్ అయ్యింది.
8వ తారీఖు వచ్చినా ఇంకా పెన్షన్ రాని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. ఇదే విషయం పై ఒక ప్రముఖ ఛానెల్ లో వచ్చిన వార్తాను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియో చూస్తూ ముసలి వారి పడే కష్టాలకు కన్నీళ్లు వస్తున్నాయి. మాకు ఇంకా పెన్షన్ ఇవ్వలేదు అయ్యా, తిండి కూడా తినట్లేదు అంటూ ఒక తాత ఏడుస్తూ చెప్తే, మరొక అవ్వ, కనీసం 10 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఆకలి వేస్తుంది అని వేడుకునే పరిస్థితి వచ్చింది. మరి కొంత మంది, మమ్మల్ని రోజు తిప్పించుకుంటున్నారు. చార్జీలకు డబ్బులు అయిపోతున్నాయి అంటూ బాధ పడుతున్నారు. ఇలా తాము పడుతున్న కష్టాలు చెప్తూ, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, టైంకి పెన్షన్ ఇచ్చే వారని, రెండు నెలల నుంచి లేట్ అవుతుందని, బాధ పడుతున్నారు..
చంద్రబాబు ఈ వీడియో పోస్ట్ చేస్తూ, ఇలా స్పందించారు... "పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణం. ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏమిటి? ఆకలికి అలమటిస్తున్న పేదల బాధ ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? అనవసర విషయాలపై కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికా బద్దంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? గతంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడే వస్తున్నాయంటే నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా మేలుకుని పెండింగ్ పింఛన్లను వెంటనే ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి." https://www.facebook.com/tdp.ncbn.official/videos/484863779010975/