విద్యుత్‌ రంగంలో గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రం గణనీయమైన పురోభి వృద్ధిని సాధించింది. మండు వేసవిలో సైతం విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24/7 విద్యుత్‌ సరఫరాతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. రాష్ట్ర విభ జన సమయంలో (జూన్‌, 2014లో) రోజుకు సగటున 22.5 మిలియన్‌ యూనిట్ల లోటుతో ఉన్న విద్యుత్‌ రంగం నేడు సున్నా విద్యుత్‌ లోటుకు చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న చర్యలతోనే సాధ్యమైంది. అంతేకాకుండా విద్యుత్‌ లోటుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారిపోయింది. గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో వ్యవస్థాపక సామర్ధ్యం నూరు శాతం పెరిగింది. గతంలో 9,529 మెగావాట్లుగా ఉన్న వ్యవస్థాపక ఉత్పత్తి సామర్ధ్యం ఇప్పుడు 19,080 మెగావాట్లకు చేరుకుంది.

game 27032019

ఏపీజెన్‌కో 2,250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అందించింది. ఇందులో కృష్ణపట్నం సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుండి రెండు 800 మెగావాట్లు అంటే 1600 మెగావాట్లు, రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ) స్టేజ్‌ 4 నుండి 600 మెగావాట్లు, నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ వద్ద నున్న హైడల్‌ స్టేషన్‌ నుండి రెండు 25 మెగావాట్ల చొప్పున 50 మెగావాట్లను ఉత్పత్తి చేసింది. అలాగే పునరుత్పాదక ఇంధనం ద్వారా మరికొంత విద్యుత్‌ను నిల్వచేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీజెన్‌కో పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మితమవుతున్న 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుతో పాటు మరో రెండు 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ యూనిట్లను విజయవాడ, కృష్ణపట్నం పోర్టుల వద్ద ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కష్టాలను తీసుకొచ్చింది. అప్పట్లో 2006-07లోని విద్యుత్‌ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయింపులు చేశారు. దీంతో విభజన జరిగిన జూన్‌ 2014 నుండి నూతన రాష్ట్రానికి విద్యుత్‌ కష్టాలు తప్పలేదు.

game 27032019

వాస్తవానికి రాష్ట్ర భౌగోళిక స్వరూపం, జనాభా ప్రాతిపదికన కేటాయింపుల చేసినట్లయితే కొత్త రాష్ట్రలో కొంతమేరైనా విద్యుత్‌ కష్టాలు తప్పి ఉండేవి. చంద్రబాబు వచ్చిన తరువాత రాష్ట్ర విద్యుత్‌ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యుత్‌ వినియోగాన్ని వీలైనంతమేర తగ్గించుకునేలా ఐఎస్‌ఐ ఉత్పత్తులను వాడేలా ప్రజల్లో చైతన్యం కల్పించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, సోలార్‌ పంపుసెట్ల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే విద్యుత్‌ పొదుపు, ఇంధన సామర్ధ్యం వంటి ప్రమాణాలను ప్రోత్సహించారు. దీంతో లోటు విద్యుత్‌తో కొట్టుమిట్టాడిన రాష్ట్రం కాస్తా మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి 7,464 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో 4,059 మెగావాట్ల పవన విద్యుత్‌, 2,591 మెగావాట్ల మేర సౌర విద్యుత్తు ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read