కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేస్తుంది అంటూ, అమరావతిలో ఈ ఆరు నెలల్లో ఏమి జరిగింది, వాస్తవ పరిస్థితిని ప్రజలను వివరించటానికి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అమరావతి పర్యటనకు ఈ రోజు వెళ్లారు. అయితే, చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్ళే ముందు, జరిగిన సీన్ చూసి, ఒక్కసారిగా అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు, ఉదయం 8 గంటలకు ముఖ్య నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు 9 గంటల సమయంలో, అక్కడ ఉన్న నేతలతో కలిసి, ఆయన నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదిక స్థలం వద్దకు వచ్చారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు బయలుదేరే ముందు, నడక ద్వారా బయలుదేరి, ప్రజా వేదిక పరిస్థితి ఎలా ఉందొ చూపిస్తాను అంటూ, అక్కడ ఉన్న నేతలకు, కార్యకర్తలకు చూపించారు.
అయితే ఆరు నెలలు అయినా ప్రజా వేదిక వద్ద ఉన్న వ్యర్ధాలు అలాగే ఉన్నాయి. రేకులు, ఇనుప కడ్డీలు, స్లాబ్, ఇతర వ్యర్ధాలు అన్నీ అక్కడే ఉన్నాయి. చంద్రబాబు అక్కడ సీన్ చూసి, ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడే ఎన్నో కలెక్టర్ల సమావేశాలు పెట్టేవారమని, ఎంతో మంది ప్రజలను, కలుసుకుని, వారి సమస్యలను పరిష్కరించే వారమని, గుర్తు చేసుకుని బాధ పడ్డారు. అక్కడే ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు, ఇదేంటి, ఇంకా ప్రజా వేదిక కూల్చిన సందర్భంలో, ఉన్న వ్యర్ధాలు ఇక్కడే ఉన్నాయి అంటూ, చూసి షాక్ అయ్యారు. ఆరు నెలలు గడిచినా, ఇక్కడ నుంచి వ్యర్ధాలు తియ్యలేదు అంటే, జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో అర్ధమవుతుందని అన్నారు.
ప్రతి రోజు చంద్రబాబు, తన ఇంటికి వెళ్తూ, ప్రజా వేదిక శిధిలాలు చూసి, కుమిలి పోవాలి అనే ఉద్దేశంతోనే, ఇలా ఉంచేసారని నేతలు అన్నారు. ప్రభుత్వం మారిన తరువాత, ప్రతిపక్ష నాయకుడు హోదాలో, తన ఆఫీస్ కింద, ప్రజా వేదికను, తనకు కేటాయించాలని, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. అయితే, ఆ వెంటనే రెండో రోజే, అక్కడ కలెక్టర్ల సమావేశం పెట్టిన జగన్, వెంటనే ఈ ప్రజా వేదిక కూల్చివేయాలని, కరకట్ట మీద అక్రమంగా కట్టారని అన్నారు. చెప్పినట్టుగానే, రాత్రికి రాత్రి ప్రజా వేదిక కూల్చేసారు. అయితే, అప్పటి నుంచి ఆ శిధిలాలు మాత్రం, అక్కడ నుంచి తియ్యలేదు. ప్రతి రోజు చంద్రబాబు అవి చూస్తూ వెళ్ళాలని, అక్కడే ఉంచారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ, ఇది జగన్ మనస్తత్వం అని చెప్తుంది.