ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది. కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆదివారంతో పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష కూడా పూర్తి అవుతుంది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ఇవాల్టితో పూర్తి స్థాయి సమీక్ష సమావేశాల ముగుస్తాయి. లోక్ సభ, అసెంబ్లీకి సంబంధించి దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపిక చేసిన అభ్యర్థులను ఈనెల 13, 14 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో తెలుగుదేశం నేతల్లో హీట్ పెరిగిపోయింది. మొదటి లిస్టు లో ఎవరి పేరు ఉంటుందా అనే టెన్షన్ నేతల్లో మొదలైంది. ఇప్పటికే కొంత మందికి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు.

cbn 10032019 2

గతంలోలా కాకుండా ఈసారి అన్నీ తానై చంద్రబాబు అభ్యర్థులను ఎంపిక చేశారు. అసెంబ్లీ 150 స్థానాల విజయం లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఆఖరి నిముషంలో ఉంటుంది. అలాంటిది గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ సమీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటికే 100 అసెంబ్లీ స్థానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో 115 మందితో టీడీపీ జాబితా విడుదల కానుంది. ఇదిలా ఉండగా అరకు పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం కసరత్తు నిర్వహిస్తున్నారు.

cbn 10032019 3

ఈ రోజు చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అమరావతి రాలేరని, వేల కోట్లు పంపిస్తారనిచంద్రబాబు అన్నారు. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు వచ్చాయని చెబుతున్నారని, కేసీఆర్ సంపాదించిన డబ్బులో ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారని విమర్శించారు. ఎందుకు పెట్టుబడి పడుతున్నారంటే ఆయనకు సామంత రాజ్యం కావాలని, దానికి ఒక పథకం ప్రకారం మనిషిని పెట్టుకున్నారని.. ఆ మనిషే జగన్మోహన్ రెడ్డని చంద్రబాబు అన్నారు. అతనిని ఎంపోర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్నారని, ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు పంపించారని.. ఇంకా ఎంత పంపిస్తారో తెలియదని అన్నారు. అదే కేసీఆర్ తనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. జగన్ తన కేసుల మాఫీ, ప్రయెజనాల కోసం.. కేసీఆర్, ఢిల్లీలో ఉన్న నాయకులందరూ కలిసి కుట్రలు పన్నితే.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని, ఇక్కడ వాళ్ల ఆటలు సాగనియ్యమని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read