సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం పై, చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చెయ్యటం పై కూడా చంద్రబాబు స్పందిన్కాహారు. ఈ రోజు మీడియా సమావేశం పెట్టి, అక్కడ మీడియా వారికి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా, వైసిఈ చేస్తున్న అరాచకాలను, కొన్ని క్లిప్పింగ్స్ రూపంలో చూపించారు. వైసిపీ నేతలు, కార్యకర్తలు, ఆంబోతులు లాగా ప్రజల మీద పడుతున్నారని, . ఈ ఆంబోతులు ఓ నేరచరిత కలిగిన వ్యక్తిని అడ్డం పెట్టుకుని, రెచ్చిపోతున్నారని చంద్రబాబు అన్నారు. కొన్ని ఉదాహరణలు చంద్రబాబు చదవి వినిపించారు. ఒక వైసీపీ అతను , జోహార్ చంద్రబాబు అంటూ కామెంట్ పెట్టారని, మేమంతా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నది ఇలాంటి వెధవ మాటలు వినడానికా? అంటూ మండిపడ్డారు. ఇవి కొన్నిమాత్రమేనని, వాళ్లు చేసినవన్నీ డీజీపీకి ఇచ్చామని, కానీ డీజీపీకి అవేమీ కనిపించడంలేదని విమర్శించారు.

sm 03102019 2

మహిళలను కూడా వదిలిపెట్టటం లేదని, పంచుమర్తి అనురాధ, జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అంటూ సుప్రీం కోర్ట్ చెప్పిన వ్యాఖ్యలు చదివితే, ఆమె పై అసభ్యంగా బూతులు తిడుతూ పెట్టరాని అన్నారు. ఇలాంటి వారి పై, ఇప్పటి వరకు 49 కంప్లైంట్ లు ఇచ్చామని, ఒక్క కేసు విషయంలో కూడా పోలీసులు స్పందించలేదని అన్నారు. కాని మావారు, కడుపు మండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం, వెంటనే అరెస్ట్ చేసి, బెయిల్ కూడా రాకుండా, ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. చిన్న చిన్న విషయాలు పెట్టినా, తట్టుకోలేక పోతున్నారని, వీరిని స్టేషన్ లో కొడుతూ, అక్కడ స్థానికి వైసిపీ ఎమ్మెల్యేలకు ఫోన్ లో లైవ్ చూపిస్తున్నారని అన్నారు. పోలీసులు ఇలాగేనా చేసేది అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా, పోలీసులను చంద్రబాబు హెచ్చరించారు.

sm 03102019 3

పోలీసులు, అధికారులు, ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని, అతిగా ప్రవర్తించవద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గమనించాలని అన్నారు. గతంలో ఇలాగే విర్రవీగిన అధికారులు, జైలల్లో కూర్చుని, ఇప్పటికీ కేసుల కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నరాని చంద్రబాబు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి భజన చేస్తూ, రూల్స్ కు అతీతంగా స్పందిస్తూ, అధికారులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలని హితవు పలికారు. రాష్ట్రం కోసం పోరాడటానికి ఎంతకైనా సిద్ధమని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో నీచాతినీచంగా పద్ధతి లేకుండా తెదేపా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించడం చూస్తే బాధ కలుగుతోందన్నారు. ఇప్పటి వరకూ172 వివిధ రకాల అక్రమ కేసులు, 10 ఎస్సీ, ఎస్తేఎ కేసులు బనాయించి హింసించడం పోలీసులకు తగదన్నారు. పోలీసు అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ఎప్పటికైనా వైకాపా నేతలతోపాటు పోలీసులు సైతం చట్టం ముందు తలవంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read