మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్తుంటే, బీజేపీ నాయకులు మాత్రం, గోబెల్స్ ప్రచారం చేస్తూ, మీకు లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని సహాయం మీకు చేసాం, మీరు UCలు ఇవ్వలేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మీరు అవినీతి చేసారు అంటూ, ఇలా ఎదురు దాడి చేసి, మోడీకి బాగా తెలిసిన గోబెల్స్ ప్రచారంతో అటు నేషనల్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా చెయ్యటానికి ఏమి లేదు అని వాతావరణం తీసుకువచ్చారు... ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని కాయితాలు బయట పెట్టినా, వీరు మాత్రం, గోబెల్స్ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు..
దీని పై చంద్రబాబు స్వయానా దృష్టి సారించారు... వీరి ప్రచారాన్ని తిప్పి కొట్టటానికి, తానే స్వయంగా రంగంలోకి దిగారు... వీరి గోబెల్స్ ప్రచారాన్ని, చంద్రబాబే తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు... ఇందుకోసం ఇప్పటికే 72 పేజీల నివేదికను, పుస్తకాల రూపంలో అందరి నేతలకు అంద చేసారు... అయితే, ఇప్పుడు ఆయనే స్వయంగా, అన్ని విషయాలను, ఈ రోజు సాయంత్రం 3 గంటలకు నేషనల్ మీడియాకు, ప్రజంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు...
విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని, కేంద్రం చేస్తున్న తప్పుడు ప్రచారం, ఇలా అన్ని విషయాలు, వీడియోలు, డాక్యుమెంట్ ల సాయంతో, ఆ ప్రజంటేషన్ లో వివరించనున్నారు... ఈ విధంగా, మోడీ చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి తెర దింపాలని, చంద్రబాబు నిర్ణయించారు... ఈ విధంగా, మన వాదన కూడా ప్రజల ముందు పెట్టి, ఎవరు నిజాలు చెప్తున్నారో, ప్రజలే నిర్ణయిస్తారని, దేశంలోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు ఉద్దేశం..