టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన వివరాలు. రాష్ట్రంలో అరాచక, దుర్మార్గ పాలన నడుస్తోంది. దీపావళిని హిందువులంతా ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి పండుగ రోజున ఎన్నికలు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? పలానా రోజులో ఎలక్షన్ అయిపోవాలని ముఖ్యంత్రి కేబినెట్ మీటింగ్ లో చెప్తే.. ఎస్ఈసీ దానికి తానాతందానా అంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏం కొంపలు మునిగిపోయాయని పండగ రోజు ఎన్నికలు పెడుతున్నారు. మీ నెత్తినేమైనా క-త్తి వుందా..ఎస్ఈసీ.? మీ ఇష్టానుసారంగా ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా పండగరోజు నామినేషన్ వేయాలా.? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అభ్యర్థులు, పార్టీ నాయకులకు 16 సూచనలు పంపుతున్నా. వైసీపీ నేతలు ఎన్నికలను ప్రహసనంగా తయారు చేశారు. నీచాతి నీచంగా తయారు చేశారు. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరును నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. పోలీసులు వచ్చి నామినేషన్లు వేయకుండా బెదిరించారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. అయినా ముందుకు వెళ్లిన వారిని తరిమికొట్టారు. ఒకవేళ నామినేషన్ వేసినా రక్షణ కల్పించాల్సిన పోలీసులే వెంటాడారు. అధికార పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులు నామినేషన్ పత్రాలు చించేశారు. మరికొన్ని పరిశీలనలో సరిగా లేవని అకారణంగా తొలగించారు. అన్నీ అధికమించి పోటీలో నిలబడితే లైట్లు ఆపి ఫలితాలను ప్రకటించుకున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం, ఎగతాలి చేయడం కాదా.? ఉ-న్మా-దు-లు, పిచ్చోళ్లు ఇలాంటి పని చేస్తారు. ఎన్నికలు సజావుగా జరగాలని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. అక్కడి నుండి కొన్ని ఆదేశాలు వచ్చాయి.

cbn 04112021 2

గత ఎన్నికల్లో పుంగనూరు మున్సిపాలిటీలో కమిషనర్ లోకేశ్వర్ వర్మపై ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు ఇచ్చాం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి, కింద అధికారులను లోబరుచుకుని, పోలీసులు కూడా వైసీపీకి అనుకూలించి ఏకపక్షంగా చేసుకునేలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వాటిన్నింటికీ ఈ లోకేశ్వర్ వర్మ లోగుట్టు ఆదేశాలు ఇచ్చారు. గతంలో పుంగనూరులో జరిగినవన్నీ ఆధారాలతో సహా చూపించాం. పుంగనూరులో 24 మంది అభ్యర్థులు ధైర్యంగా టీడీపీ తరపున నామినేషన్ వేశారు. నామినేషన్లు అన్నీ చించేసి 24 నామినేషన్లు ఏకగ్రీవం చేశారు. 8,9, 14,15 వార్డులకు కొత్త నామినేషన్ వేసే అవకాశం అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చారు. ఫోటోలు చూపిస్తూ.... పెద్దిరెడ్డ రామచంద్రారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో కమిషనర్ లోకేశ్వర వర్మ పాల్గొన్నారు. మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన కూడా పుంగనూరు వ్యక్తే. ఇప్పుడు అతన్ని కుప్పంలో వేశారు. పెద్దిరెడ్డికి చెంచా. పెద్దిరెడ్డి ఇంట్లో పెట్టుకో. పోలీసులను, అవినీతి పరులను పెట్టుకుని అక్రమాలు చేస్తున్నారు. వెలుగు సిబ్బంది, సంఘమిత్రులతో సమావేశాలు పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని చెప్తున్నారు. కింది అధికారులను పిలిచి ఏకగ్రీవం చేయాలని చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఏకైక పార్టీ టీడీపీ. ఆగస్టు సంక్షోభంలోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే 30 రోజులు పోరాడి తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్లి ప్రజలు, కార్యకర్తలు పడుకున్నారు. మిమ్మల్ని చరిత్ర హీనులుగా నిలబెడతాం. మీకు ఎన్నికల అధికారులు సహకరించవచ్చు. ఉన్నాద పాలన పెట్టుకుని చేస్తామంటే కుదరదు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి. ఏం చేస్తోంది ఎన్నికల కమిషన్.? ఫిర్యాదులు ఉన్న అధికారులను ఎన్నికల్లో వేస్తారా.? ఏం చేసినా అడిగేవారు లేరని, ముఖ్యమంత్రి తుగ్లక్ ఉన్నాడు, అడిగింది చేస్తాడని అనుకుంటున్నారు. మీ అంతం ప్రారంభం అవుతుంది గుర్తుంచుకోవాలి.

ఇలాంటి వింతలు ఎప్పుడైనా చూశామా? ప్రజలు ఆలోచించాలి. ఎన్నికలంటే ఊరికొక ఆంబోతు , రౌడీలు తయారై ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకోండి. రేపు అనే ఒక రోజు ఒకటి ఉంది. మీకు అంత భరోసా వుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి ప్రజలు మీ బట్టలూడదీస్తారు? మీలాగా మేం మాట్లాడలేమా? మేం దా-డు-లు చేయలేమా? కానీ మా సంస్కారం అది కాదు. నెల్లూరు, గురజాల, బేతంచెర్ల ఎన్నికలపై లేఖ రాస్తే ఒక కాగితం మాత్రం చూశారు. కోడ్ వచ్చాక అందరూ దాని పరిధిలో ఉండాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, సాక్షి గుమాస్తా ఇష్టమెచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు. నా జీవితంలో కుప్పంలో మొన్నిటి సభకు వచ్చినంతమంది జనం ఎప్పుడూ రాలేదు. కుప్పంలో ఏం చేయాలో చేసి చూపిస్తాం. కొందరు కల్చర్ లేకుండా మాట్లాడుతున్నారు. విద్యుత్ పై ట్రూ అప్ చార్జీలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. ప్రాణాలకు రక్షణ లేదు. పేదోడు కడుపునిండా తినే అన్నా క్యాంటీన్ తీసేశారు. అక్రమాలు జరిగితే నేనే ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్తా, కింది స్థాయి వరకూ వెళ్తా. దౌర్జన్యంగా ఓట్లేయించుకుంటామంటే మీ ఆటలు సాగవు. పట్టాభి మీద ఇంతక ముందు కూడా దా-డి చేశారు. ఎవర్ని అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయంపైనా దా-డి చేశారు.. ఎవర్ని పట్టుకున్నారు.? వివేకానే చం-పి-తే-నే దిక్కులేదు..ఇవేం పెద్ద లెక్కకాదు అనుకుంటున్నారు. ప్రజలు వెంటాడితే రాష్ట్రం నుండి బయటకు పోలేవు..ఇంటి నుండి బయటకు కూడా రాలేరు. ఎవరు నేరంలో భాగస్వామ్యం అయ్యారో కమిషన్ పెట్టి బయటకు తీసుకొస్తాం. కోర్టు నిర్ణయాలు కూడా లెక్క చేయని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో కోర్టులో చిన్న కామెంట్లు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఐఎఎస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొందరు ఇంకా నిజాయితీగా వున్నారు. తుగ్లక్ జగన్ తో కోర్టు చుట్టూ తిరగటానికి అధికారులు సిద్ధపడొద్దు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read