మొన్న సున్నా వడ్డీ ఛాలెంజ్ పైనా, నిన్న అమరావతి రుణం పైనా, ఈ రోజు 45 ఏళ్ళ పెన్షన్ పైనా... అసెంబ్లీలో ఏ విషయం పైనా చంద్రబాబుకు మాట్లాడే అవకాసం ఇవ్వటం లేదు. అధికార పక్షం అన్నీ అబద్ధాలు చెప్పటం, చంద్రబాబుకి అది కౌంటర్ ఇచ్చే అవకాసం ఇవ్వకుండా, సభను వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం, ఇదే జరుగుతుంది. దీంతో సభలో మాట్లాడే అవకాసం ఇవ్వకపోవటంతో, జగన్ మాట్లాడే మాటలే ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉంది. అందుకే చంద్రబాబు అసెంబ్లీలో అవకాసం ఇవ్వకపోవటంతో, ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, అసెంబ్లీలో జగన్ ఆడుతున్న అబద్ధాలను డాక్యుమెంట్ ప్రూఫ్ తో, వీడియో ప్రూఫ్ తో, విలేకరుల సమావేశంలో చూపించి, జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలను ఎండగడుతున్నారు.
ఈ రోజు కూడా అసెంబ్లీలో 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ ఇస్తాను అంటూ జగన్ ఇచ్చిన హామీ పై, తెలుగుదేశం నిలదీసింది. జగన్ మాత్రం, నేను అలా చెప్పలేదని, 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాను అని చెప్పానని చెప్పారు. అయితే, ఇది కౌంటర్ చేసే అవకాసం తెలుగుదేశం పార్టీకి స్పీకర్ ఇవ్వలేదు. ఆందోళన చేస్తున్న ముగ్గురు సభ్యులను అసెంబ్లీ అయ్యేంతవరకు సస్పెండ్ చేసారు. దీంతో చంద్రబాబు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, జగన్ ఆడిన అబద్ధాలు అన్నీ వీడియో వేసి విలేకరులకు చూపించారు. జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో, అక్టోబర్ 18 2017న, ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసి లకు 45 ఏళ్ళకే రెండు వేలు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన వీడియో అది. అలాగే, తన సాక్షి ఛానెల్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ను కూడా చంద్రబాబు చూపించారు.
అందులో కొమ్మినేని శ్రీనివాస్, జగన్ ని అడుగుతూ, మీకు 45 ఏళ్ళకే పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనిపించింది అని అడిగితే, సెంటిమెంట్ డైలాగ్ లు చెప్తూ, జగన్ సమాధానం ఇచ్చారు. ఇలా ఈ వీడియో కూడా చూపించారు. తరువాత వివిధ సందర్భాల్లో వైసిపీ పార్టీ, ఈ 45 ఏళ్ళకే పెన్షన్ అనే హామీని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన స్క్రెన్ షాట్స్ కూడా చూపించారు. స్వయానా జగన్ మోహన్ రెడ్డి ఎకౌంటులోనే, నేను 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను, మాట తప్పను, మడం తిప్పను అని పోస్ట్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా ఈ పధకం రద్దు అయిందని ఎక్కడా చెప్పలేదు. అయితే జగన్ మాత్రం, నేను 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాను అని చెప్పానని, చెప్పి, 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ అనే మాటను మర్చిపోయారు. చంద్రబాబు ఇవన్నీ వీడియోలు వేసి అసెంబ్లీలో చూపిస్తారని భయపడి, టిడిపి సభ్యులను సస్పెండ్ చేసారు. అయితే చంద్రబాబు ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి ఈ విషయం పై ప్రజలు ఏమి డిసైడ్ చేసుకుంటారో ?