అందరి రాజకీయ నాయకుల్లాగా ఓట్లు సీట్లు కోసమే కాదు, భవిష్యత్తు తరాల గురించి ఇప్పటి నుంచే ఆలోచించే నేత చంద్రబాబు. అందుకే అభివృద్ధి, సంక్షేమం మాత్రామే కాదు, ఎన్నో రిఫార్మ్స్ కూడా తీసుకువచ్చి, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఫిజికల్ లిటరసీని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా, ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో, రాష్ట్రానికి మంచి క్రీడాకారులని తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. క్రీడాభివృద్ధి పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసారు. ఒలింపిక్ పోటీలలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులను ఎంపికచేసే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు.

cbn gandeeva 18072018 2

ఈనెల 20లోగా అథ్లెట్ల ఎంపిక పూర్తవుతుందని, మలిదశలో వీరిని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’కు పంపించి అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తామని తెలిపారు. ‘పాంచజన్య’ ప్రాజెక్టు కింద బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, సైక్లింగ్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్ బాల్, వాలీబాల్ తదితర క్రీడలలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. అన్ని పాఠశాలలో ఫిజికల్ లిటరసీని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వున్న అన్ని ఎస్‌సీ, ఎస్‌టీ గురుకుల పాఠశాలల్లో అత్యాధునిక క్రీడా వసతులను ఏర్పాటు చేస్తున్నామని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు చెప్పారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలను క్రీడా నగరాలుగా తీర్చిదిద్దే కృషిలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాలలో క్రీడలకు అవసరమైన అవుడ్డోర్, ఇండోర్ స్టేడియాలు, ఇతర క్రీడా సదుపాయాలను కల్పించాలని చెప్పారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో మన విద్యార్థులు పతకాలను గెలుచుకునే స్థాయికి ఎదగాలని చెప్పారు.

cbn gandeeva 18072018 3

అనంతపురము జిల్లా కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల వ్యయంతో ఇండోర్, అవుడ్డోర్ స్పోర్ట్స్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నామని యువజన, క్రీడా వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి వివరించారు. ప్రఖ్యాత అమెరికన్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఏపీ స్పోర్ట్స్ యూనివర్శిటీ సహకారంతో విశాఖ నగరంలో 250 ఎకరాలలో పీపీపీ పద్ధతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. తిరుపతిలో పీపీపీ విధానంలోనే 70 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ సిటీని నెలకొల్పుతున్నామన్నారు. ఒంగోలులో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు కేటాయించిన 40 ఎకరాల స్థలం విషయంలో లీగల్ వివాదాలు తలెత్తినందున మరో స్థలాన్ని గుర్తించే పనిలో వున్నామని తెలిపారు. విజయవాడ విద్యాధరపురంలో 9 ఎకరాలలో స్పోర్ట్ షాపింగ్ కాంప్లెక్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. రూ.175 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన బీఆర్ స్టేడియం నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read