భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా త‌న‌కు రాసిన 9 పేజీల లేఖ పై స్పందిస్తూ, చంద్రబాబు సినిమా పంచ్ లకు మించిన పంచ్ లు వేసారు... శనివారం ఆ లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక పక్క వాస్తవాలు చెప్తూ, ఎక్కడ చురకలు అంటించాలో అక్కడ అంటించారు.... కేంద్రం ఇస్తున్న పధకాలకు, మోడీ ఫోటో పెట్టటం లేదంటూ చెప్తున్నారు, మీ మోడీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు కేంద్ర పధకాలకి మన్మోహన్ ఫోటో పెట్టారా ? సోనియా గాంధి ఫోటో పెట్టారా అంటూ పంచ్ వేసారు.. అంతే ఒక్క బీజేపీ ఎమ్మల్యేకు సౌండ్ లేదు...

cbn modi 24032018 2

మరో పక్క, నేను తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి శ్రేయోభిలాషిని అని అమిత్ షా అంటున్నారు, ఆయాన అంత పెద్ద శ్రేయోభిలాషి అయితే నేను ఎందుకు వదులుకుంటాను ? దండలు, సాలువాలు నాలుగు ఎక్కువ కప్పేవాడిని అంటూ, కౌంటర్ ఇచ్చారు... అలాగే, మిత్రధ‌ర్మాన్ని పాటించ‌కుండా త‌మ పార్టీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంద‌ని బీజేపీ నేత‌లు అంటున్నార‌ని, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణలో ఎవరిని అడిగి టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్ర‌శ్నించారు... మిత్ర‌ధ‌ర్మం విష‌యంలో తాను తొంద‌ర‌ప‌డ్డానా? బీజేపీ తొంద‌ర‌ప‌డిందా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

cbn modi 24032018 3

ప్రజలు కట్టిన పన్నుల్లోంచే రాష్ట్రానికి వాటా ఇస్తున్నారని, కేంద్ర విద్యాసంస్థలకు రూ.11672 కోట్లు అవసరమైతే 576 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్ర విద్యాసంస్థలకు రూ.11584 కోట్ల విలువైన భూములు ఇచ్చామని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు... అలాగే, ఆంధ్రప్రదేశ్ కోసం ఆరోజు పార్లమెంట్ లో పోరాడింది బీజేపీ మాత్రమే అని గుర్తుంచుకోవాలని అమిత్ షా రాసిన రాతల పై స్పందిస్తూ, ఈయన ఆరోజు ఢిల్లీలో లేడేమో ..నేనున్నా ..20 నిమిషాల్లో పాసైన ఆ బిల్లులో, వీళ్ళు పోరాడింది ఏంటి ? కాంగ్రెస్ కి వీళ్ళు ఏమి డిస్కషన్ లేకుండా మద్దతిచ్చారు... కనీస స్పృహ ఉండక్కర్లా ...ఇలాంటివి రాసేముందు.. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం,అనే కనీస స్పృహ ,పద్దతి,హుందా లేకుండా రాసిన లెటర్ అది... చట్టం అమలు చేయమన్నాం..వీళ్ళు సాయంచేసినా..ఊరికే తీసుకోమ్..ఆంతకంత తిరిగిస్తారు ఆంధ్రులు అంటూ చంద్రబాబు అమిత్ షా ని వాయించి పెట్టారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read