ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేసారు. మొన్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, విజయవాడలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూల మాల కూడా వెయ్యకుండా, ఉన్న ఫోటో ప్రధాన పత్రికల్లో వచ్చింది. ఆ వార్తా కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో, తెలుగు భాషా దినోత్సవం కోసం, ప్రభుత్వం విడుదల చేసిన 18 లక్షల జీవో కాపీని కూడా జోడించారు. 18 లక్షలు తెలుగు భాషా దినోత్సవం కోసం అని విడుదల చేసి, రాజధానిలో ముఖ్య ప్రాంతం అయిన విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూల మాల కూడా వెయ్యకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఈ డబ్బులు ఏమి అయ్యాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

cbn 31082019 2

అంతే కాదు, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అనే పాట ఏ అధికారిక కార్యక్రమంలో కూడా వినిపించటం లేదని చంద్రబాబు అన్నారు.. ఇది చంద్రబాబు ట్వీట్.. "తెలుగు భాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 లక్షలతో ఏం చేసినట్టు? "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్ర గీతం... ఈ మూడు నెలల్లో ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా? ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం?" అంటూ ట్వీట్ చేసారు.

cbn 31082019 3

ఇక నిన్న జరిగిన ఇసుక ధర్నాల పై కూడా చంద్రబాబు ట్వీట్ చేసారు. "తెదేపా హయాంలో ఉచిత ఇసుక యూనిట్ ధర రూ.1200లుగా ఉంటే, వైకాపా రివర్స్ టెండరింగ్ మాయాజాలంతో యూనిట్ ధరను రూ.10,000లు చేసి, వైకాపా నాయకులు ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని నిరూపించుకున్నారు. వాళ్ళ ధన దాహంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసారు. సిమెంట్ బస్తాకు 10 రూపాయిలు J-ట్యాక్స్ కట్టే వరకూ ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలి. తుగ్లక్ పాలనతో రోడ్డున పడిన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ. 60 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉద్యమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను అభినందిస్తున్నాను. కార్మికులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ వారి తరపున పోరాడుతుంది." అని ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read