కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఈ నాలుగేళ్లలో ఎదుర్కోలేని వ్యక్తి మన దేశ ప్రధాని అంటే నమ్మగలరా. మళ్ళీ నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, దానిలో దమ్ము ఉంది అంటూ డైలాగులకి కొదవే లేదు. ఇలాంటి వ్యక్తి చెప్పే అబద్ధాలు విని, విసుగెత్తి, బహిరంగ చర్చకు రండి అంటే, పారిపోతున్నారు. నిన్న చంద్రబాబు, ఈ రోజు రాహుల్, ఇద్దరికీ సమాధానం చెప్పే దమ్ము మన ప్రధానికి లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ‘కాపలాదారు దొంగ’ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం సంచలన డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ముఖాముఖి చర్చించేందుకు రావాలని కోరారు. ఏ అంశంపైన అయినా తాను మాట్లాడతానని, కేవలం 20 నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు.

rahul 02012019

కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే ఏమిటో రాహుల్ గాంధీకి తెలియదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఈ సవాల్ విసిరారు. పారికర్‌ పడకగదిలో రఫేల్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలను దాచి పెట్టారంటూ ప్రశ్నించారు. మోదీ నిజాన్ని ఎంత దాచి పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అది ఎన్నటికీ దాగలేదని ఆయన అన్నారు. ‘రఫేల్‌ ఒప్పందం విలువ రూ.58వేల కోట్లు అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో చెప్పారు. అంటే ఒక్కో విమానం ధర రూ.1600కోట్లు. విమానం ధర రూ.526కోట్ల నుంచి రూ.1600కోట్లకు ఎలా వెళ్లింది. అంతలా ధరను ఎవరు పెంచారు. ధరను పెంచడంపై వైమానిక దళం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణ చేస్తే కచ్చితంగా ఇద్దరు పేర్లు బయటకు వస్తాయని మాకు నమ్మకం ఉంది. రఫేల్‌ ద్వారా మోదీ అనిల్‌ అంబానీకి సాయం చేశారనే విషయం బయటపడుతుంది’. అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు.

 

rahul 02012019

నిన్న చంద్రబాబు కూడా ఇదే విధమైన ఛాలెంజ్ చేసారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐ సహా సమస్త వ్యవస్థల్నీ ఆయన భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆక్షేపించారు. తాను ఆక్రోశంతో మాట్లాడుతున్నానని మోదీ అనడంపై అభ్యంతరం తెలిపారు. ‘నేను ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను. ఆయన ఢిల్లీలో కూర్చుని ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఈ అంశాలపై ఆయన చర్చకు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. దేశంలో అవినీతిని మోదీ ఏ మాత్రం తగ్గించారని నిలదీశారు. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలపై ఏం చెబుతారని అడిగారు. ‘బ్యాంకులను ముంచిన అవినీతిపరులు దేశాన్ని వీడి దర్జాగా వెళ్లిపోతున్నారు. దేశంలో ప్రగతి రేటు పడిపోయింది. ప్రజల ఆదాయం క్షీణించిపోయింది. మోదీ ఆర్థిక, పాలనా విధానాలు దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. ప్రతిపక్ష కూటమి విఫలం కాలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి నమ్మకం నిలుపుకోవడంలో మోదీ, ఎన్డీఏ కూటమే విఫలమయ్యాయి’ అని ఆయన అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read