కేంద్రం పై తిరుగుబాటు చేసి, తన పార్టీకి చెందిన కేంద్ర మంత్రులని రాజీనామా చేపించిన చంద్రబాబు, పోయిన వారం అంట ఆ హడావిడిలో ఉన్నారు... అయితే, చంద్రబాబుకి ఇప్పుడో ఇంకో సమస్య వచ్చి పడింది... ఆయన అలా రిలాక్స్ అయ్యే అవకాసం కూడా లేకుండా, రాజ్యసభ ఎన్నికల రూపంలో మరో సమస్యని పరిష్కరించాల్సిన పరిస్థితి...సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది... ఆదివారం లోపు, ఎదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి... రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి 23వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మూడింటిలో రెండు టీడీపీకి, ఒకటి వైఎస్సార్ సీపీకి దక్కే పరిస్థితి ఉంది. అయితే, కేవలం బీజేపీ ఎమ్మల్యేలను కలుపుకుంటే, మరో నలుగురు ఎమ్మల్యేలు కలిసి వస్తే, మూడో సీటు కూడా తెలుగుదేశం దక్కించుకునే అవకాసం ఉంది... అయితే, చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో సీటు కోసం చూస్తారా లేదా అనేది చూడాలి.. జగన్ మీద విశ్వాసం లేదని, ఇప్పటికే 23 మంది ఎమ్మల్యేలు పార్టీ మారగా, మరో 25 మంది ఎమ్మల్యేలు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు... అయితే, ఈ అవకాశం చంద్రబాబు ఉపయోగించుకోరు అనే వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం కేంద్రం పై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబు, ఇలాంటి టైంలో రాజకీయం జోలికి వెళ్ళ దలుచుకోలేదని చెప్పినట్టు సమాచారం..
అయితే టీడీపీకి దక్కే రెండు స్థానాల పై, భారీగా ఆశావహులు ఉన్నారు... పార్టీ సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం అధ్యక్షులు కళావెంకట్రావ్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీలోని పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారని ఆ సామాజిక వర్గానికి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్, బీద మస్తాన్ రావు, వర్ల రామయ్య ప్రస్తుతం టీడీపీ తరపున అభ్యర్థుల రేసులో ఉన్నారు. ఈ ముగ్గరిలో ఇద్దరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనను మరోసారి కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ గట్టిగా కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్రెడ్డిలు తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కసరత్తు పూర్తయ్యే సరికి, ఎవరు అలుగుతారో, ఎవరు ఎలా స్పందిస్తారో, వీరందరినీ చంద్రబాబు ఎలా సముదాయిస్తారో, చివరకు ఎవరిని రాజ్యసభకు పంపుతారో చూడాలి...