యాభై శాతం ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ అంశంపై 22 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా ఈ ఉదయం సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. 50శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్‌పై .. కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. చంద్రబాబు సహా 21 పార్టీల విపక్షనేతలు రివ్యూ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 5శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని.. ఇప్పటికే ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన విషయం విధితమే. అంతకు ముందు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీ భవన్‌లో ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. వీవీప్యాట్ల అంశంపై చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా మధ్య చర్చ జరిగింది. అనంతరం ఇద్దరూ కలిసి సుప్రీం కోర్టుకు వెళ్లారు.

supreme 07052019

సోమవారం రాత్రి చంద్రబాబు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ రాశారు. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని, భారీగా అదనపు సిబ్బంది అవసరమని సుప్రీంకోర్టుకు ఈసీ వినిపించిన వాదనను తప్పుపట్టారు. ‘‘వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుందన్నదొక్కటే ఈసీ అభ్యంతరం. కానీ, ఈసీ వాదనలో నిజం లేదు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినప్పుడే గరిష్ఠంగా రెండో రోజుకు తుది ఫలితాలు వచ్చేవి. 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపునకు ఒక్కరోజుకంటే ఎక్కువ సమయం పట్టదు. 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తే... ఒక్కో టేబుల్‌కు వెయ్యి చొప్పున గంటకు 14వేల ఓట్లు లెక్కించవచ్చు. అలాగే, దీనికి అదనపు సిబ్బంది కూడా అవసరం లేదు. ఈవీఎంలలో ఓట్లు లెక్కించిన వారినే వీవీప్యాట్ల లెక్కింపునకూ ఉపయోగించుకోవచ్చు’’ అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.

supreme 07052019

ఈసీ తన వాదనలోని డొల్లతనాన్ని గ్రహించి, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘‘50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఓటు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దానిపై అనుమానం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించకూడదు. ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని, భారీగా అదనపు సిబ్బంది అవసరమని సుప్రీంకోర్టుకు ఈసీ వినిపించిన వాదనను చంద్రబాబు తప్పుపట్టారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read